Lavanya Case..దాదాపు 8 నెలల క్రితం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) పై లావణ్య(Lavanya )అనే అమ్మాయి ఆరోపణలు చేస్తూ.. మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించి, ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని, అంతేకాదు తన దగ్గర డబ్బు తీసుకొని ఇప్పుడు తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని , ఇప్పుడు ఇంకొక హీరోయిన్ మోజులో పడి తనను దూరం పెడుతున్నాడు అంటూ కూడా కామెంట్లు చేయడంతో హీరో రాజ్ తరుణ్ ఇలాంటి వాడా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ పై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పించారు. ఇక ఆ సమయంలో లావణ్య కు నార్సింగ్ పోలీసులతో పాటు పలువురు మీడియా మిత్రులు కూడా సహాయం చేశారు.
రాజ్ తరుణ్, లావణ్య కేసు పై స్పందించిన శేఖర్..
అయితే రాజ్ తరుణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. లావణ్య ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడం వల్లే తాను దూరం పెట్టాను అంటూ చెప్పి ఇక సైలెంట్ అయిపోయాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఈ విషయంపై కూడా ఆయన స్పందించలేదు. ఇక అదే సమయంలో మస్తాన్ సాయి (Mastan Sai), చింటూ(Chintu ), శేఖర్ భాష(Sekhar basha) వంటి వార్ల పేర్లు గట్టిగా వినిపించాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందు ఈమెతో లైవ్ లో డిబేట్ పెట్టుకున్నారు. అదే సమయంలో లావణ్య శేఖర్ బాషాపై చెప్పు విసిరి సంచలనంగా మారింది. ఇక తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆమె.. తనను శేఖర్ బాషా విచక్షణారహితంగా కొట్టాడని.. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత లావణ్య తన రౌడీ మూకతో శేఖర్ భాషాపై కూడా దాడి చేసి, అతడిని గాయపరిచారు. ఇదంతా ఇలా ఉండగా ఆ సమస్య సద్దుమణిగిందని అందరూ అనుకునే లోపే.. మళ్ళీ లావణ్య మస్తాన్ సాయి గుట్టు బయట పెడుతూ.. అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించింది.
రాజ్ తరుణ్ వ్యక్తిత్వంపై శేఖర్ భాషా కామెంట్..
ఇక ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత కాస్తో కూస్తో ఫేమ్ అయినా శేఖర్ బాషా మళ్లీ ఈ విషయంపై స్పందిస్తూ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా శేఖర్ భాష ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ.. “మన గురించి మనం చెప్పుకుంటే డప్పు కొడుతున్నారు అంటారు. కానీ ఇతరుల గురించి చెప్తున్నాము అంటే ఇక వారు ఎంత మంచి వారో అర్థం చేసుకోవాలి. రాజ్ తరుణ్ ఎంత మంచివాడు అంటే ఇక ఆయన గురించి మాటల్లో చెప్పలేము. ఆయన సినిమాల్లో నటించిన తర్వాత రూ.5కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉండగా.. అప్పుడు ఒక టాలీవుడ్ నిర్మాత ఇంత డబ్బు తీసుకుంటే టాక్స్ లని మళ్లీ నష్టపోతారు. అని ఒక విల్లాను రెమ్యూనరేషన్ కింద ఇచ్చారు ఇక ఆ విల్లా కోసం అటు లావణ్య కూడా సహాయం చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో రాజ్ తరుణ్ ఎప్పుడూ షూటింగ్స్ అంటూ ఉదయం వెళ్లి రాత్రి 9 గంటలకు వచ్చేవాడు. ఆయన కూడా నిఖిల్ (Nikhil), వరుణ్ సందేశ్(Varun sandesh) వంటి వారితో గ్యాంగ్ ను మైంటైన్ చేస్తూ.. మందు తాగేవాడు.. కానీ ఎవరిని ఏమీ అనేవాడు కాదు. ఇంటికి వస్తే ఇక్కడ లావణ్య చింటూ, మస్తాన్ సాయితో పాటు మరికొంతమంది గ్యాంగ్ తో రాజ్ తరుణ్ ఇంట్లోనే డ్రగ్స్ సేవిస్తూ రెచ్చిపోయేది. ఇక రాజ్ తరుణ్ తో కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత ఇద్దరు బ్రేకప్ అయ్యారు. అయినా సరే రాజ్ తరుణ్ ఆమెను పలకరించేవాడు.. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంత బ్రాడ్ మైండడో అర్థం చేసుకోవచ్చు.ఇక ఆయనను ప్రతిరోజు హింసించేది. మందు తాగి ఆయన అవార్డులన్నీ పగలగొట్టింది. ఇంటి గ్లాసులన్నీ పగలగొట్టేసింది. అంతేకాదు రాజ్ తరుణ్ తల్లిని కూడా దూషించింది అయినా సరే రాజ్ తరుణ్ సైలెంట్గా అమ్మాయి అని వదిలేసేవాడు. ఇక ఇంత మంచివాడు బాహుబలిని మించి అని అనడంలో సందేహం లేదు” అంటూ రాజ్ తరుణ్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు శేఖర్ భాష. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.