AUS vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ… ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు… భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో.. 8 వికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ అద్భుతమైన సెంచరీ తో దుమ్ము లేపాడు. 143 బంతుల్లో 165 పరుగులు చేసి… రఫ్ ఆడించాడు. ఇందులో 17 బౌండరీలు, మూడు సిక్సర్లు కూడా ఉన్నాయి. బెన్ డకేట్ దాటికి… 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది ఇంగ్లాండు టీం.
Also Read: Indian National Anthem: పాకిస్తాన్ గడ్డపై.. ఇండియా జాతీయగీతం… గూస్ బంప్స్ రావాల్సిందే !
అయితే 165 పరుగుల వద్ద లబుషంగే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. లేకపోతే ఇవాల్టి మ్యాచ్లో 400 పరుగులు చేసేది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ లో 165 పరుగులు చేసి… సరికొత్త రికార్డు సృష్టించాడు డకెట్. ఈ మ్యాచ్ లో 165 పరుగులు చేసి… చాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకేట్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు.. ఈ రికార్డు జాసన్ రాయి పేరున ఉండేది. 2004 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో… ఆస్ట్రేలియా పైన 145 పరుగులు చేశాడు జాసన్ రాయ్. ఆ తర్వాత ఇప్పుడే.. బెన్ డకేట్ 165 పరుగులు చేసి రఫ్పాడించాడు.
ఈ ఒక్క రికార్డే కాదు… ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరో రికార్డ్ బద్దలు కొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో.. హైయెస్ట్ టోటల్ ను రిజిస్టర్ చేసుకుంది ఇంగ్లాండ్ టీం. అటు ఇప్పటివరకు… చాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో… ఒక్క జట్టు కూడా ఈ స్థాయిలో పరుగులు చేయలేదు. ఇంగ్లాండ్ మొదటిసారిగా ఈ స్థాయిలో పరుగులు చేసింది. గతంలో అంటే 2004 సంవత్సరంలో న్యూజిలాండ్ వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో యూఎస్ఏ పైన నాలుగు వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది న్యూజిలాండ్.
Also Read: PAK Team – ICC CT 2025: భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే… లెక్కలు ఇవే?
అయితే ఆ రికార్డును తాజాగా ఇంగ్లాండ్ జట్టు బీట్ చేసింది. ఇటు 2017 సంవత్సరంలో… పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య… 338 పరుగుల టార్గెట్ నమోదు అయింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అలాగే 2013లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగగా.. ఆ సమయంలో 331 పరుగులు నమోదు అయ్యాయి. 2009 సంవత్సరంలో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరిగేగా ఆ సమయంలో 323 పరుగుల టార్గెట్ నమోదు అయింది. ఇక ఇవాల్టి మ్యాచ్ విషయానికి వస్తే…. ఇంగ్లాండు పెట్టిన 351 పరుగులను ఆస్ట్రేలియా ఛేజ్ చేస్తే… మరో రికార్డు నమోదు అవుతుంది. ఈ మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోయారు. కీలకమైన ప్లేయర్లు దూరం కావడంతో బెన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. ఆడం జంపా రెండు అలాగే లబుషాంగే రెండు వికెట్లు తీశాడు.