Murder Mystery OTT: ఓటీటీ లోకి కొన్ను రకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరికొన్ని సినిమాలు మాత్రం ఆలోచింప చేస్తున్నాయి. థ్రిల్లర్ సినిమాలు అనేక ట్విస్ట్ లతో స్టోరినీ పూర్తి చేస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో తెలుస్తుంది. అటు థియేటర్లలో యావరేజ్ టాక్ ని అందుకున్న సినిమాలు సైతం ఓటిటిలో పాజిటివ్ టాక్ తో భారీ వ్యూస్ ని రాబడుతున్నాయి.. మర్డర్ మిస్టరీ సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటిటీ లోకి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది.. తాజాగా మరో మర్డర్ మిస్టరీ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది.. మూవీ పేరేంటి? స్ట్రీమింగ్అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
గతేడాది రిలీజ్ అయిన మర్డర్ మిస్టర్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో యావరేజ్ కాకుండా అందుకున్న కూడా ఓటిటిలో మాత్రం మంచి వ్యూస్ ని రాబట్టాయి. ఇక ప్రేక్షకులు ఎక్కువగా అలాంటి సినిమాలోనే చూడడంతో ఓటిటి సంస్థలు కూడా అలాంటి కథలు ఉన్న సినిమాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తమిళ్ మలయాళ సినిమాలతో పాటు కన్నడ సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ని అందుకుంటున్నాయి. కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ టెనెంట్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.. ఈ థ్రిల్లర్ మూవీలో ధర్మ కిరీటీరాజ్, సోను గౌడ, రాకేష్ మైయా కీలక పాత్రలు పోషించారు. శ్రీధర్ శాస్త్రి దర్శకత్వం వహించాడు..
Also Read :సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కబోతున్న మృణాల్.. వీడియో వైరల్..
స్టోరీ విషయానికొస్తే..
గత ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టెనెంట్ మూవీ నవంబర్లో థియేటర్లలో రిలీజ్ అయింది.. కోవిడ్ టైం లో ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. మామూలుగా సినిమాలకు రెండు గంటలు ఉంటుంది కానీ ఈ సినిమా ఒక గంట 30 నిమిషాలు మాత్రమే రన్ టైం తో వచ్చింది. థియేటర్లలో ఈ మూవీ యావరేజ్ టాక్‌తో మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో కథను చివరి వరకు లాక్కొచ్చాడు. సినిమా క్లైమాక్స్ చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఓ భార్యాభర్తలిద్దరూ ఓ వ్యక్తికి తమ ఇంటిని రెంటుకి ఇస్తారు. వ్యక్తి ఇంటిని ఖాళీ చేయమన్నా ఖాళీ చేయకుండా ఉంటాడు. అయితే ఓనర్ భార్య తన తో అసభ్యకరంగా ప్రవర్తించారని తన భర్త తో చెప్తుంది. అతను ఆ వ్యక్తిపై కోపంతో కొట్టడానికి వెళ్తారు. కానీ అతను చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ.. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు అనేది పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలు మారుతుంది.. జై పోలీస్ ఆఫీసర్గా వస్తాడు. కేస్ ని చేదించాడా? లేదా అన్నది మూవీలో చూడాల్సిందే…