Bigg Boss Telugu 9: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం ఒకటి. తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక తొమ్మిదవ సీజన్ ప్రసారానికి కూడా మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss Season 9) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయిందని సమాచారం. ఇక ఈ సీజన్ లో పెద్ద ఎత్తున బుల్లితెర సెలబ్రిటీలతో పాటు పలువురు యూట్యూబర్స్ కూడా పాల్గొనబోతున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ హీరో…
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొంతమంది పేర్లు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోయే వారి జాబితా ఇదే అంటూ ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించిన నటుడు సుమంత్ అశ్విన్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన నటి దీపిక కూడా ఈ సీజన్లో ఛాన్స్ అందుకున్నారని సమాచారం.
బుల్లితెర నటీ నటులు…
ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అవుతూ నిత్యం వివాదాలలో నిలిచిన వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఒకరు. అయితే ఈ ముగ్గురిలో ఒకరు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో అలేఖ్య చిట్టి ఛాన్స్ కొట్టేసారని తెలుస్తుంది.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో గత సీజన్లలో రియల్ జంట కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే సీజన్ 9 కార్యక్రమంలో బుల్లితెర నటీనటులు హారిక ఏక్ నాథ్ జంట హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ప్రముఖ యూట్యూబర్ అనిల్ కూడా సీజన్ 9 కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇటీవల అనిల్ ఇస్మార్ట్ జోడిలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
?igsh=aDlsNGhmYjFzZGNl
Also read : Peddi Movie: పెద్ది సినిమాకు నేషనల్ అవార్డు పక్కా… హైప్ పెంచిన అర్జున్ అంబటి!
ఇక బుల్లితెర సీరియల్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న వారిలో కావ్య ఒకరు. ప్రస్తుతం కావ్య స్టార్ మాలో చిన్ని సీరియల్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈమె కూడా బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసారని సీజన్ 9 కంటెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్న కమెడియన్ ఇమ్మానుయేల్ బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసారని సమాచారం. ప్రస్తుతం ఈయన స్టార్ మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో సందడి చేస్తున్నారు. బుల్లితెర నటీమణులు అయిన తేజస్విని, డెబ్జాని, రీతు చౌదరి, బుల్లితెర నటుడు శీతాకాంత్, శివకుమార్, సీనియర్ బుల్లితెర నటుడు ప్రదీప్ వంటి వారిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. తుది జాబితాను బిగ్ బాస్ నిర్వాహకులు అధికారకంగా తెలియజేయాల్సి ఉంది.