BigTV English

Father’s Day Wishes: మీ ప్రియమైన నాన్నకు ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా!

Father’s Day Wishes: మీ ప్రియమైన నాన్నకు ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా!

తండ్రి మీద మీకున్న ప్రేమను తెలియజేసేందుకు అత్యుత్తమ సమయం ఫాదర్స్ డే. ఆదివారం జూన్ 15న ఈ పితృ దినోత్సవ నిర్వహించుకుంటారు. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇంతకన్నా మంచి సమయం ఏముంది? ఇక్కడ మేము ఫాదర్స్ డే సందేశాలు, శుభాకాంక్షలు, కోట్ లను తెలుగులోనే ఇచ్చాము. మీ నాన్న హృదయాన్ని గెలవడానికి ఇందులో ఉన్న అందమైన సందేశాన్ని ఎంపిక చేసుకొని మీ తండ్రికి పంపించండి. మీ మనసులోని ప్రేమను, గౌరవాన్ని ఆయనకు తెలియజేయండి.


ఫాదర్స్ డే శుభాకాంక్షలు 2025
నేను దారి తప్పితే నాకు దారి చూపించే దిక్సూచి నువ్వే
ప్రతి అడుగులోనూ నాకు నువ్వే తోడు
నీవు లేని జీవితం నాకు శూన్యం
ఫాదర్స్ డే శుభాకాంక్షలు డియర్ నాన్న

జీవితంలో నాకు అత్యంత ప్రియమైన
వ్యక్తివి నువ్వే నాన్నా
నీకోసం నా జీవితాన్ని అర్పిస్తాను
ఫాదర్స్ డే శుభాకాంక్షలు


బాల్యంలో మీ వేలు పట్టుకుని
నడవడం నేర్పించావు
ప్రతి కష్టంలోనూ పోరాడడం నేర్పావు
పడిపోయినప్పుడు తిరిగి లేచి నిలబడేలా ప్రోత్సహించావు
ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసావు
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

నా దగ్గర డబ్బు లేకపోయినా
నేను బాధపడను
ఎందుకంటే ప్రపంచంలో నీలాంటి నాన్న నాకు ఉన్నాడు
నువ్వు నా పక్కన ఉంటే
ఎప్పటికీ నేను ధనవంతుడినే
హ్యాపీ ఫాదర్స్ డే

జీవితంలో ప్రతి ఆనందాన్ని
అడగకుండానే నువ్వు నాకు ఇచ్చావు
నీకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను
ఫాదర్స్ డే నాడు..
నా హృదయపూర్వక ధన్యవాదాలు అందుకో నాన్నా

నిస్వార్ధ ప్రేమకు ప్రతిరూపం నువ్వే నాన్న
ప్రతి కష్టంలోనూ నువ్వే నాకు కవచం
ప్రపంచంలో ఉన్న సంపదంతా ఒకవైపు..
నువ్వు మరోవైపు.
నువ్వే నా అతి పెద్ద బలానివి
హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా

బిడ్డ ఆనందం కోసం ఒక తండ్రి ఏదైనా చేయగలడు
నిప్పుల మీద కూడా నడవగలడు
అలాంటి నా తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే

నన్ను నీడలో ఉంచి
నువ్వు ఎండలో నిలుచున్నావు
నీలో నేను ఒక దేవదూతను చూసాను
దైవమంటే నా దృష్టిలో నాన్నే
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

నువ్వే నా భూమి
నువ్వే నా ఆకాశం
నువ్వే నా దేవుడు
నీవు లేని జీవితం నాకు నిర్జీవం
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

నా జీవితంలో దృఢమైన స్తంభం
నా నమ్మకం, నా ఉనికికి కారణం నువ్వే నాన్న
కేవలం నువ్వు నా తండ్రివి మాత్రమే కాదు
దేవుడి కంటే ఎక్కువ
హ్యాపీ ఫాదర్స్ డే

తండ్రి అంటే ఆస్తినిచ్చే వ్యక్తి కాదు
సమాజంలో బిడ్డలకు గుర్తింపునిచ్చే వ్యక్తి
తండ్రి ఉన్న కొడుకే అత్యంత ధనవంతుడు
హ్యాపీ ఫాదర్స్ డే

నా తండ్రే నా ధైర్యం, నా గౌరవం
అతనే నా బలం, నా ధనం, నా గుర్తింపు
హ్యాపీ ఫాదర్స్ డే డియర్ నాన్న

అమ్మ నాకు జన్మనిచ్చింది
నా తండ్రి నాకు ప్రపంచాన్ని పరిచయం చేశారు
తన భుజాలపై ఎత్తుకొని
ఈ ప్రపంచానికి నన్ను చూపించాడు
హ్యాపీ ఫాదర్స్ డే డియర్ నాన్న

తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ
నేను ఎప్పుడూ చూడలేదు
నా తండ్రికి అవసరమైనప్పుడల్లా
అతని పక్కనే నేను ఉంటాను
హ్యాపీ ఫాదర్స్ డే డియర్ నాన్న

పిల్లలకు వచ్చే ప్రతి బాధను భరించే వ్యక్తి తండ్రి
బిడ్డలకు దేవుడికి ఇచ్చిన బహుమతి ఆయనే
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

తండ్రి వేప చెట్టు లాంటివాడు
వేపచెట్టు ఆకులు చేదుగానే ఉంటాయి
కానీ అది చల్లని నీడను అందిస్తుంది
స్వచ్ఛమైన గాలిని ప్రాణంలో నింపుతుంది
తండ్రి కూడా అంతే…
బయటకు చేదుగా ఉన్నా
మనసులో మాత్రం అంతా తీపే
హ్యాపీ ఫాదర్స్ డే

ప్రపంచానికే నువ్వు నా తండ్రివి
కానీ నాకు మాత్రం నువ్వే ప్రపంచం
హ్యాపీ ఫాదర్స్ డే

దారి తప్పిన ప్రతిసారీ
నా చేయి పట్టుకుని మళ్ళీ నాకు దారి చూపించావు
నా జీవితానికి చుక్కానిలా మారావు
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×