BigTV English

Bigg Boss Sivaji: ఆయన దగ్గర డ్రామాలు దొబ్బితే.. శిక్ష ఇలా ఉంటుంది

Bigg Boss Sivaji: ఆయన దగ్గర డ్రామాలు దొబ్బితే.. శిక్ష ఇలా ఉంటుంది

Bigg Boss Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన శివాజీ.. హీరోగా మంచి హిట్ సినిమాల్లో నటించాడు. ఇక సినిమాలను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మొదటి నుంచి కూడా టీడీపీ కి సపోర్ట్ గా నిలబడిన శివాజీ ఎన్నో వివాదాలను ఎదుర్కున్నాడు. ఎన్నో కేసుల్లో ఇరికించబడ్డాడు. ఇక అవన్నీ వదిలేసి.. సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 లో అడుగుపెట్టాడు.


పెద్దన్న శివాజీగా హౌస్ మొత్తాన్ని ఒక తాటి మీద నడిపించి.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా గెలిపించాడు. హౌస్ నుంచి బయటకి వచ్చాక షోస్, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. అంతేకాకుండా #90s వెబ్ సిరీస్ ద్వారా కూడా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ ప్రస్తుతం పలు సినిమా కథలను వింటున్నట్లు సమాచారం. ఇక తాజాగా ఏపీలో కూటమి గెలిచిన విషయం తెల్సిందే.

కూటమి గెలుపుపై ఎట్టకేలకు శివాజీ స్పందించాడు. నేడు తిరుమల స్వామివారిని కుటుంబంతో సహా దర్శించుకున్న శివాజీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ” స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే తేడాగా ఉన్నాడు. ఇప్పుడు అంతా బావుంది. వేస్ట్ మాటలు వద్దు. ఆంధ్రప్రదేశ్ అమరావతి, పోలవరం.. ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామిదగ్గర మాట ఇచ్చినవారికి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీ అందరు చూసారు.


చంద్రబాబు , పవన్ కళ్యాణ్, నిజేపీ ఆధ్వర్యంలో ఏపీ బావుంటుంది. అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్ధం చేసుకోండి. మీరు ఆరోజు తిట్టినా కొట్టినా.. తిరిగి ఆ కర్మ మళ్లీ మిమ్మల్నే తిడుతున్నారు.. కొడుతున్నారు. అవసరమా.. ప్రజలు.. ప్రజలు గా ఉండాలి కానీ అన్ని భుజాన వేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరం బావుండాలి. ఏపీకి స్వర్ణ యుగం మొదలయ్యింది. స్వామి నిర్ణయం ఇది. స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే.. ఎవడికైనా ఇదే శిక్ష” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శివాజీ మాటలు విన్న అభిమానులు.. రాజకీయాలు వద్దు అంటే మళ్లీ అందులోకి పోతావేంటయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×