Vaibhav Suryawanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ( IPL 2025) … అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ టోర్నమెంటరీ నేపథ్యంలో… 14 ఏళ్ల కుర్రాడు… అరంగేట్రం చేశాడు. మొన్న మెగా వేలంలో అనూహ్యంగా.. భారీ ధర దక్కించుకున్న వైభవ్ సూర్య వంశీ… తాజాగా ఐపిఎల్ అరంగేట్రం కూడా చేశాడు. శనివారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా తన తొలి ఐపిఎల్ మ్యాచ్ ఆడేశాడు వైభవ్ సూర్య వంశీ (Vaibhav Suryawanshi).
తొలి బంతికే భారీ సిక్సర్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కావడంతో… ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి వైభవ్ సూర్య వంశీ దిగాడు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని… చాలా చక్కగా వినియోగించుకున్నాడు ఈ 14 సంవత్సరాల సూర్యవంశీ. అంతేకాదు లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాత అటాకింగ్ ఆ బ్యాటింగ్ చేసి దుమ్ము లేపాడు 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ.
కన్నీళ్లు పెట్టుకున్న సూర్య వంశీ
ఐపీఎల్ టోర్నమెంటులో అరంగేట్ర మ్యాచ్ లోనే అలరించిన 14 సంవత్సరాల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ… ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. లక్నో బౌలర్ మార్కరం బౌలింగ్ స్టంప్ అవుట్ అయ్యాడు సూర్య వంశీ. అయితే అవుట్ అయిన తర్వాత వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ కుర్రాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన తొలి మ్యాచ్లో 20 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశం 3 సిక్సర్లు అలాగే రెండు బౌండరీలతో రెచ్చిపోయాడు. ఇందులో 34 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ ధర ఎంత?
14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీని 1.10 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. 2024 చివర్లో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ జరిగింది. సౌదీలోని ( Saudi ) జెడ్డా వేదికగా ఈ మెగా వేలం జరిగింది. ఈ సందర్భం గా ఎవరు ఊహించని.. 14 ఏళ్ల వైభవ్… వేలంలోకి వచ్చాడు. అయితే రాహుల్ ద్రావిడ్.. చొరవ కారణంగా అతని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ఇక ఇప్పుడు అతని సేవలను… వినియోగించుకుంటుంది రాజస్థాన్ రాయల్స్. బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ… అండర్ 19 టీమిండియాలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ కుర్రాడు లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయడమే కాకుండా… బౌలింగ్ కూడా చేస్తాడు. అంటే ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. 2011 మార్చి 27వ తేదీన బీహార్లో జన్మించాడు ఈ కుర్రాడు. ఇప్పటివరకు లిస్ట్ ఏ, టి20 లు కూడా ఆడాడు.
🥲🥲🥲🥲pic.twitter.com/RxLwVF8XsU https://t.co/mMJHciixpR
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) April 19, 2025
Hungry for more… Don't cry young boy… You are a super Star ⭐
Vaibhav Suryawanshi #RRvsLSG pic.twitter.com/8sIYR8DxAS
— ꧁ⓈⒽⓇⓊⓉⒾ꧂ (@Shruti_1704) April 19, 2025