BJP MLA on Allu Arjun.. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప2’. రేపు అనగా డిసెంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. అంతేకాదు ఈరోజు రాత్రికే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా.. టికెట్ ధరల పెంపు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సామాన్యుడు మొదటి ఐదు రోజుల వరకు సినిమాను చూసే అవకాశం లేకుండా చేశారు ‘మైత్రి మూవీ మేకర్స్’.
బెనిఫిట్ షోలతోనే లాభం..
ముఖ్యంగా ఒక్కో సినిమా టిక్కెట్ పై 800 రూపాయలు అదనంగా ప్రకటించడంతో సామాన్యులు సినిమాను చూడలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రతి అభిమాని కూడా కూడా తమ అభిమాన హీరో సినిమాలు మొదటి షో, మొదటి రోజే చూడాలని కలలు కంటారు. కానీ ఇలాంటి ధరలు చూసిన తర్వాత వెనకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. దీనిపై పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా సామాన్యులను, వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా కోర్టులో కేసు కూడా వేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా బెనిఫిట్ షో లతోనే లాభం మొత్తం పొందేయాలని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
పుష్ప లో చూపించిందంతా అబద్ధం..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టిక్కెట్ ధరల పెంపుపై మండిపడుతూ అల్లు అర్జున్ ను బండబూతులు తిడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (Rakesh Reddy. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పుష్ప -2 సినిమాను విడుదల చెయ్యొద్దు అంటూ బాంబ్ పేల్చారు. పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం రూ.10 లక్షలు ఉంటే అక్కడ రూ .కోటి లాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను కూడా నరికేశారు. ఇప్పుడు పుష్ప 2 విడుదల అయితే ఇంకెన్ని చెట్లు నరికేస్తారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సినిమా యువతకు మంచి నేర్పించాలి కాని ఈ సినిమా యువతను పాడు చేస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ లను అరెస్టు చేయాలి..
అందుకే హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ను అరెస్టు చేసి జైల్లో వేయాలి. అసలు ఈ సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి.అలాగే టికెట్ ధరల పెంపుపై మాట్లాడుతూ.. అసలు అల్లు అర్జున్ కి ఏం తక్కువయింది. వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ రూ.2000, రూ.3000, రూ .5000 అంటే ఎక్కడి నుంచి సామాన్య ప్రజలు తీసుకొచ్చి సినిమా చూస్తారు. అంత డబ్బు ఉండి కూడా ఎందుకు ఇలా రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెడతారు అంటూ మండి పడ్డారు. ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్ లను రైతుల దగ్గరకు తీసుకెళ్లి వారి దగ్గర ఎర్రచందనం ధరలు ఎలా ఉన్నాయో వీరికి ముందు చూపించాలి. ఇక పుష్ప 2 విడుదల అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎంత తలనొప్పి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు 10 మందిని చంపేవారు. ఇప్పుడు 1000 మందిని చంపుతారు.ఇలాంటి సినిమాలు తీస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ మండిపడ్డారు.
అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
పుష్ప-2 టికెట్ల రేట్ల పెంపుపై మాట్లాడుతూ.. అల్లు అర్జున్ను బూతులు తిట్టిన రాకేశ్ రెడ్డి pic.twitter.com/sADSWc3vyZ— ChotaNews (@ChotaNewsTelugu) December 4, 2024