Balakrishna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.136 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీకరా స్టూడియోస్ బ్యానర్ పై సితార ఎంటర్టైన్మెంట్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో వచ్చిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal), చాందిని చౌదరి (Chandini chowdary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha srinath), ఊర్వశీ రౌతేలా (Urvashi rautela) కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అటు బాలయ్యకు కూడా మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు బాలకృష్ణ. అందులో భాగంగానే తన ‘బ్లాక్ సండే’ సెంటిమెంట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
సెంటిమెంట్ గా మారిన బ్లాక్ సండే..
సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే అది మంచి అయినా చెడు అయినా.. ఏదైనా ఒక సందర్భంలో మంచి జరిగింది అంటే, మళ్ళీ అదే రిపీట్ కావడానికి.. అదే రంగు దుస్తులు వేసుకోవడం లేదా అదే ముహూర్తం పాటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో చెడు జరిగితే మాత్రం మళ్లీ అలాంటి సందర్భాలు రాకుండా జాగ్రత్త పడతారు. ఇక బాలయ్య విషయంలో కూడా నలుపు రంగు దుస్తులు చాలా డేంజర్ అని, అందులోనూ ఆదివారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకుంటే ఆ రోజంతా ఆయనకు బ్లాక్ డేంజర్ లా అనిపిస్తుందని తెలిపారు బాలకృష్ణ. అంతేకాదు ఆదివారం రోజు ఏమవుతుందిలే అని బ్లాక్ డ్రెస్ వేసుకోగా.. ఆరోజు జరిగిన సంఘటన గురించి కూడా ఆయన వెల్లడించారు.
నడుము విరిగింది..
ఇదే విషయంపై బాలయ్య మాట్లాడుతూ.. నాది మూలా నక్షత్రం. నాకు ఆదివారం నలుపు మంచిది కాదు. ఒకసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఏం కాదులే అని నేను ఆదివారం రోజు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. దాంతో నా నడుము కాస్త విరిగిపోయింది అంటూ తెలిపారు. ఇక దీనిపై బాలయ్య క్లారిటీ ఇస్తూ..” సాధారణంగా నేను జాతకాలను బాగా నమ్ముతాను. ఏ పని మొదలుపెట్టినా సరే సమయం, సందర్భం చూసి మరీ ప్రారంభిస్తాను. అందుకే నా జాతకం ప్రకారం ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు ధరించను. అయితే ఒకసారి బ్లాక్ డ్రెస్ ధరించాను. ‘ఆదిత్య 369’ సినిమాకు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP. Balasubramanyam) నిర్మాతగా ఉన్నారు. నేను ఆరోజు బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్లాను. అప్పుడు మనసు చెబుతోంది ఈరోజు సండే వద్దు అని.. రాకరాక ఎస్పీ బాలసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్ కి వచ్చారు. అయితే ఆయన కళ్ళముందే నేను కింద పడడంతో నా నడుము విరిగింది “అంటూ బాలకృష్ణ చెప్పారు. అయితే తాను వచ్చినప్పుడే బాలయ్యకు ఇలా జరిగిందని బాలసుబ్రమణ్యం కంగారు పడ్డారని, ఆ తర్వాత ఆయన షూటింగ్ కి ఎప్పుడు రాలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బాలయ్య సెంటిమెంట్ కారణంగా అటు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య బ్లాక్ సండే సెంటిమెంట్ గురించి తెలిసి అభిమానులు సైతం జాగ్రత్త పడండి అంటూ సలహాలు ఇస్తున్నారు.