Karam Johar: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్. ఈ పేరుకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమాలో ఇతను తెలియని వారు ఉండరు. ఆయన సినిమాలే ఆయనకు బ్రాండ్. తెలుగులో బడనిర్మాతలు ఎలా అయితే ఉన్నారో బాలీవుడ్ లో బడ నిర్మాతలలో ఒకరు కరణ్. మన తెలుగు స్టార్స్ కి బాలీవుడ్ లో ఎంట్రీకి కారణం కరణ్ జోహార్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా బాహుబలిని హిందీ ఆడియోస్ కు పరిచయం చేసిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. తెలుగు సినిమాలు ఎన్నింటినో హిందీలోకి డబ్ చేసి విడుదల చేసిన ఘనత కరణ్ జోహార్ కి దక్కుతుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈయన సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. ఇప్పుడు ఆయన బరువు గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
నా సీక్రెట్ ఇదే ..
బాలీవుడ్ బడనిర్మాత కరణ్ జోహార్, ఉన్నట్టుండి ఆయన బరువు తగ్గిపోయారు. ఆయన తిండి మానేశారా లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్య తో సన్నబడ్డారా అని అందరూ అనుకునే టైంలో కరణ్ జోహార్ ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో బరువు తగ్గడం గురించి వివరించాడు. నేను బరువు తగ్గడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారని కొంత డైట్ ను పాటిస్తున్నానని శారీరక శక్తి యాక్టివ్ గా ఉండడం కోసం నేను ఒమేగా 3 అధికంగా తీసుకుంటున్నానని, ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవాలి వ్యాయామం చేయాలి అని, నేను బరువు తగ్గడానికి (Ozempic) వంటి మందులు వాడతానని, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం కూడా ఎంతో ముఖ్యమని రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేస్తానని, ఆయన బరువు తగ్గడం పై వివరణ ఇచ్చాడు. నేను బరువు తగ్గడం పై నా సీక్రెట్ ఇదే అని కరణ్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా ఆయన వెయిట్ లాస్ సీక్రెట్ ఇదేనా అయితే మనము ఫాలో అవ్వచ్చు అని, సీక్రెట్ చెప్పినందుకు థాంక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ బాద్ షా ..సినీ కెరియర్
ఇక కరణ్ సినిమా రంగానికి వస్తే, మొదట ఒక సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, తన తండ్రి యస్.జోహార్ వారసత్వంగా, నిర్మాతగా మారి ఈరోజు బాలీవుడ్ సామ్రాజ్యంలో తనదైన ముద్రవేశారు. కుచ్ కుచ్ హోతా హై సినిమాతో బాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఆ సినిమా ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత ఆయన వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. 2004లో ‘కాఫీ విత్ కరణ్’ అనే టెలివిజన్ టాక్ షో ద్వారా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా 2022లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1, ఫాంటసీస్ సినిమా ను పరిచయం చేసిన నిర్మాతగా అవార్డును అందుకున్నాడు. 2023లో ‘రాఖీ ఔర్ రామ్ కి ప్రేమ్ కహాని’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. ఏది ఏమైనా కరణ్ జోహార్ చేసిన వెయిట్ లాస్ పోస్ట్, ఇప్పుడు మరోసారి కరణ్ గురించి మనం మాట్లాడుకునేలా చేసింది.
Maheh Babu : బాబు తిరిగొచ్చాడు… మళ్లీ బోనులోకి… మళ్లీ పాస్‌పోర్ట్ సీజ్..?