E-Paper
Advertisement

War 2: తీవ్ర గాయాలైన.. సెట్‌లోకి అడుగుపెట్టబోతున్న హృతిక్..!

War 2: తీవ్ర గాయాలైన.. సెట్‌లోకి అడుగుపెట్టబోతున్న హృతిక్..!
Advertisement
Hrithik Roshan War 2 update

War 2 – Hrithik Roshan updates(Bollywood celebrity news): బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘వార్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ మూవీలో హృతిక్, టైగర్ ష్రాఫ్‌ల యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘వార్ 2’ సిద్ధమవుతోంది.

ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా భాగం కానున్నాడు. దీంతో ఈ మూవీపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఈ మూవీలో నటిస్తుంటంతో అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది.

Advertisement

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ మూవీ తెరకెక్కుతోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్ స్టార్ట్ కాగా.. తాజా షెడ్యూల్‌ని స్పెయిన్‌లో కంప్లీట్ చేశారు.

READ MORE: గాయపడ్డ హృతిక్ రోషన్.. ‘వార్ 2’ షూటింగ్‌కి బ్రేక్..?

Advertisement

మరో రెండు మూడు వారాల్లో ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే.

షూటింగ్ సమయంలో తాను తీవ్రంగా గాయపడినట్లు తెలిపాడు. అంతేకాకుండా నడుముకి బెల్ట్ పెట్టుకొని.. చేతుల కింద క్లచస్‌ సపోర్టుతో దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందరినీ షాక్‌కి గురిచేశాడు.

కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు టాక్ వినిపించింది. దీంతో ఆందోళన చెందిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని.. ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.

READ MORE: వార్ 2 డేట్ ఫిక్స్ .. సమరం ఆ రోజే ఆరంభం..

ఈ నేపథ్యంలో హృతిక్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. తాను తీవ్రంగా గాయపడినప్పటికీ షూటింగ్‌లో పాల్గొనేందుకు మళ్లీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్‌లో హృతిక్ పాల్గొనబోతున్నాడని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×