BigTV English

Healthy Life : ఈ అలవాట్లతో మీ జీవితం ఆనందమయం.. !

Healthy Life : ఈ అలవాట్లతో మీ జీవితం ఆనందమయం.. !
healthy lifestyle

healthy lifestyle (health news today india):


మన జీవితం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే చక్కని జీవనశైలి అవసరం. మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవనశైలిని అనుసరిస్తారు. అయితే మనం పాటించే జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మనం చక్కని జీవనిశైలిని కలిగి ఉండటం ఎంతో అవసరం. ఆనంద‌మైన‌, ఆరోగ్యవంత‌మైన జీవ‌న‌శైలి కోసం మ‌నం కొన్ని కచ్చితమైన మార్పులు చేసుకోవడం అవసరం. అవేంటో తెలుసుకుందాం.

ఆరోగ్య‌వంత‌మైన జీవితం కోసం ఈ అలవాట్లను కచ్చితంగా పాటించాలి. దీని కోసం మ‌న రోజూ ఉద‌యాన్నే ధ్యానం చేయ‌డం, చ‌క్క‌టి కోట్ నుండి ప్రేర‌ణ పొంద‌డం వంటివి చేయాలి. అలాగే ఉద‌యం నిద్రలేవగానే ఫోన్ చూడటం మానేయాలి.


Read More : థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా..!

మన ఇంట్లో వారి కోసం సమయం కేటాయించాలి. ఇది మ‌న మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. రోజూ ఒక చిన్న ల‌క్ష్యాన్ని ఏర్ప‌రుచుకోవాలి. ఆ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి శ‌క్తిని, బ‌లాన్ని ఏర్ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం రోజంతా ఉత్సాహంగా ఉంటాము. అలానే మ‌నం తీసుకునే ఆహారంలో పండ్లు, కూర‌గాయ‌లు ఎక్కువ‌గా ఉండేలా చూడాలి. ఫైబ‌ర్, విటమిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి. దీంతో మ‌న ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ఆనందమైన ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం చేయాలి. మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు అదుపులో ఉండ‌డానికి, జీవ‌క్రియ‌లు స‌రిగ్గా ప‌నిచేయ‌డానికి మ‌న శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.

Read More : కొలెస్ట్రాల్‌ను ఇలా కంట్రోల్ చేయండి..!

అలాగే ఇత‌రులు చేసే ప‌ని చిన్న‌ది అయినా పెద్ద‌ది అయినా దానిని ప్ర‌శంసించే అల‌వాటు చేసుకోవాలి. ఇది మీ మానశిక ఆనందాన్ని పెంచుతుంది. అదేవిధంగా స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, సన్నిహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.

వీటితో పాటుగా కళలు, ప్రకృతి, సంగీతం వంటి వాటితో సమయం గడిపే అలవాటు చేసుకోండి. ఇది మ‌న శ‌రీర శ్రేయ‌స్సుకు ఎంతో మేలు చేస్తుంది. అలానే ఒత్తిడి బారిన ప‌డ‌కుండా మన‌సును నియంత్ర‌ణ‌లో ఉంచుకునే శ‌క్తి క‌లిగి ఉండాలి. ఈ అల‌వాట్ల‌ను మన జీవనశైలిలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది.

Disclaimer : ఈ సమాచారం పలు వైద్య పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా రూపొందించబడింది.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×