Akhanda 2:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. వరుస సినిమాలతో ఈ వయసులో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న ఏకైక హీరో బాలయ్య (Balakrishna). వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. తన మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆడియన్స్ అందర్నీ కట్టిపడేస్తున్నారు. అందుకే బాలయ్యకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ‘డాకు మహారాజ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య శివతాండవం ఊహకి కూడా అందని విధంగా బోయపాటి డిజైన్ చేశారట. బాలయ్య మాస్ ఇమేజ్.. అఖండతో పాన్ ఇండియా వైడ్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందులో ఒక విలన్ గా ఆది పినిశెట్టి (Aadhi pinisetty ) ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపించగా.. వీరిద్దరి మధ్య ఒక భారీ యాక్షన్ సన్నివేశం కూడా చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య వచ్చే ఈ ఫైట్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట.
బాలయ్యతో పోటీకి సిద్ధం అంటున్న సంజయ్ దత్..
దీంతో అందరూ కూడా ఆది మెయిన్ విలన్ అని అనుకున్నారు. కానీ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu) అంచనాలను మాత్రం ఎవరు అందుకోలేకపోతున్నారని చెప్పాలి. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay dutt) ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో అసలైన ప్రతి నాయకుడి బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంజయ్ దత్ తో బోయపాటి సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే విలన్ పాత్ర మామూలుగా ఉండదు. సాధారణంగా నటీనటులనే బోయపాటి యాక్షన్ సన్నివేశాలలో ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తారు. అలాంటిది సంజయ్ దత్ లాంటి అగ్రెసివ్ నటుడితో ఇంకే రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తాడో ఊహకు కూడా అందడం లేదు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య – సంజయ్ దత్ మధ్య వార్ పీక్స్ లోనే ఉంటుందని తెలుస్తోంది.
సంజయ్ దత్ నటించిన తెలుగు చిత్రాలు..
ఇక సంజయ్ దత్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశారు. 1998లో నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన బాలీవుడ్ రీమేక్ ‘జంజీర్ ‘ లో కూడా నటించారు. ఈ సినిమా తెలుగులో ‘తుఫాన్’ గా విడుదలైంది. ఇక మళ్ళీ ఆయన తెలుగు సినిమా చేయలేదు. కానీ సౌత్ ఇండియా చిత్రమైన ‘కేజీఎఫ్ 2’ లో విలన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అఖండ 2 లో విలన్ గా నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై నిజా నిజాలు త్వరలోనే తెలియనున్నాయి.