BigTV English
Advertisement

Anasuya: అనుభవించింది చెప్పాను.. వక్రీకరించొద్దు అంటూ అనసూయ పోస్ట్.. ఏమైందంటే?

Anasuya: అనుభవించింది చెప్పాను.. వక్రీకరించొద్దు అంటూ అనసూయ పోస్ట్.. ఏమైందంటే?

Anasuya:ఎన్టీఆర్ (NTR) నటించిన ‘నాగ’ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించి, ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్ గా తన ప్రయాణం మొదలుపెట్టింది అనసూయ (Anasuya). ఆ తర్వాత జబర్దస్త్(Jabardast )లోకి వచ్చి యాంకర్ గా మారిన ఈమె, అక్కడే దాదాపు 9సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకరింగ్ చేసింది. తన వాక్చాతుర్యంతో, గ్లామర్ తో అందరినీ కట్టిపడేసింది. ఇక ఇప్పుడు యాంకరింగ్ కి గ్యాప్ ఇచ్చి, వరుస సినిమాలతో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. అనసూయ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనే కాదు లేడీ విలన్ పాత్రలు కూడా పోషిస్తూ అలరిస్తోంది. ఇక గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి, విలన్ గా మరొకసారి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలతో పాటు కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను, ట్రిప్స్ కి సంబంధించిన ఫోటోలను అన్నింటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అప్పుడప్పుడు ఈమె వేసే ట్వీట్, చేసే కామెంట్స్ కారణంగా వివాదాల్లో నిలుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈమె చేసిన మరో ట్వీట్ ఈమెను వార్తల్లో నిలిచేలా చేసింది.


నా మాటలను వక్రీకరించొద్దు అంటున్న అనసూయ..

అసలు విషయంలోకి వెళితే.. అనసూయ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “నేను నాకు ఎదురైన అనుభవాన్ని, అలాగే నేను చూసిన సంఘటనలను మాత్రమే పంచుకున్నాను. ఎవరిని నేను బ్లేమ్ చేయడం లేదు. కానీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను అన్నట్టు ప్రొజెక్ట్ చెప్పవద్దు. ఇలాంటివి నా క్యారెక్టర్ ను డిసైడ్ చేయలేవు. ఎప్పటికైనా నిజమే నిలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను” అంటూ ట్వీట్ పెట్టింది. ఇక ప్రస్తుతం అనసూయ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ట్వీట్ ఎందుకు వేసింది? ఎవరి కోసం వేసింది ? అంటూ చర్చలు మొదలయ్యాయి.


దాని ఫలితమేనా..?

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ సినీ పరిశ్రమలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి, తన డ్రెస్సింగ్ గురించి, ఫ్యామిలీ, రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడారేమో, అందుకే ఇలా ట్వీట్ చేసిందని అందరూ భావిస్తున్నారు. అయితే అసలు విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ ట్వీట్ చూసిన చాలామంది ఎందుకు ఇలాంటి ట్వీట్ పెట్టిందో అర్థం కాక ఈమె చేసిన ట్వీట్ కింద ఎందుకు ఇలాంటి ట్వీట్ పెట్టారు? అని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే అనసూయ దేనిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం అటు వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న ఈమె ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×