E-Paper
Advertisement

Met Gala 2024: మెట్ గాలా 2024 ఈవెంట్‌లో తలుక్కుమన్న తారలు వీరే..

Met Gala 2024: మెట్ గాలా 2024 ఈవెంట్‌లో తలుక్కుమన్న తారలు వీరే..
Advertisement

Met Gala 2024: ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్‌గా భావించే మెట్ గాలా 2024 ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలంతా మోడ్రన్ డ్రెస్సులో రెడ్ కార్పెట్‌పై హొయలొలికించారు.

రకరకాల ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేశారు. అందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో కెమెరాల ఫోకస్ మొత్తం ఆమెపైనే పడ్డాయి. అయితే ఈ ఏడాది షో థీమ్ పేరు.. స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్. అలాగే డ్రెస్ కోడ్ థీమ్.. ది గార్డెన్ ఆఫ్ టైమ్‌గా ఏర్పాటు చేశారు.

Advertisement

మెట్ గాలా 2024 ఈవెంట్‌లో తళుక్కుమన్న తారలు:

అలియా భట్

Advertisement

మెట్ గాలా 2024లో వేడుకలో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అలియా భట్ రెడ్ కార్పెట్‌పై అదరగొట్టేసింది. 23 అడుగుల పొడవైన సబ్యసారి చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ చీరలో అలియా ఓ యువరాణిలా దర్శనమిచ్చింది. ఆమె అందం, లుక్స్‌కి అక్కడనున్నవారంతా ఫిదా అయిపోయారు. అయితే ఆమె ధరించిన చీర కోసం దాదాపు 163 మంది 1905 గంటల పాటు కష్టపడ్డారట.

Also Read: ‘వార్ 2’ సాంగ్‌ షూట్.. ఎన్టీఆర్ – హృతిక్ పోటీ పడి మరీ ఇరగదీస్తారంట..!

కైలీ జెన్నర్

అలాగే అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా పర్సనాలిటీ, బిజినెస్‌మ్యాన్ కైలీ జెన్నర్ ఈ మెట్ గాలా 2024 వేడుకలో తన అందంతో అట్రాక్ట్ చేసింది. బాడీకాన్ ఫిట్, ఆఫ్ షోల్డర్ నెక్‌లైన్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసింది.

జెండాయా

ఈ మెట్ గాలా 2024 ఈవెంట్‌లో ప్రముఖ అమెరికన్ నటి కమ్ సింగర్ జెండాయా తళుక్కున మెరిసింది. మైసన్ మార్గీలా గౌన్‌లో కనిపించి అభిమానులకు ట్రీట్ అందించింది. ఆమె అందానికి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

జెన్నిఫర్ లోపెజ్ సిల్హొటె

జెండాయాతో పాటు మరో అమెరికన్ యాక్టర్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ సిల్హొటె కూడా మెట్ గాలా 2024లో మెరిసారు. గోల్డెన్ ఫ్లోరల్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్‌లో చాలా అందంగా కనిపించారు.

కార్డీ బి

అలాగే ప్రముఖ అమెరిన్ ర్యాపర్ కార్డీ బి బ్లాక్ గౌన్‌లో అందరినీ ఆశ్చర్యపరచింది. ఆమె ధరించిన ఆ బ్లాక్ గౌను చాలా పెద్దగా ఉండటంతో అక్కడున్న వారంతా కొత్తగా చూశారు. దీంతో ఆమె కూడా ఆ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధం.. ఈ సారి 3డీలో

షకీరా స్కార్లెట్

అంతేకాకుండా పాపులర్ కొలంబియన్ సింగర్ షకీరా స్కార్లెట్ రెడ్ కాలమ్ డ్రెస్‌లో వావ్ అనిపించేలా ఉంది. సుమారు 100 మీటర్ల పొడవుతో ఫ్యాబ్రిక్‌తో తయారుచేయబడింది.

సుధారెడ్డి

అయితే ఈ సంవత్సరం మెట్ గాలాకు హాజరైన కొద్దిమంది భారతీయులలో సుధారెడ్డి ఒకరు. ఆమె సోమవారం మెట్ గాలాలో రెండవసారి కనిపించనున్నారు. ఆమె 2021లో ఫ్యాషన్‌లో అతిపెద్ద రాత్రి రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేసింది. సుధా రెడ్డి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్.

ఆమె ఈ ప్రదర్శన కోసం దాదాపు 180 క్యారెట్ల వరకు 30 సాలిటైర్‌లతో కూడిన హెయిర్లోమ్ నెక్లెస్‌తో పాటు బెస్పోక్ తరుణ్ తహ్లియాని ధరించి ఉంటారని తెలుస్తోంది. అయితే వాటిని రూ.33 లక్షలు కంటే ఎక్కువ ఖరీదు చేసే పాతకాలపు చానెల్ బాగ్‌తో దీన్ని యాక్సెస్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి మొత్తం రూ.83 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×