BigTV English

Emergency Movie Release Date: మాజీ ప్రధానిగా ప్రస్తుత ఎంపీ.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే..!

Emergency Movie Release Date: మాజీ ప్రధానిగా ప్రస్తుత ఎంపీ.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే..!
Advertisement

Kangana Ranaut’s Emergency Release Date: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పలు సినిమాలతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు రాజకీయాలలో బిజీ బిజీగా మారనుంది. ఇటీవలే మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు సినిమాలతో అలరించిన కంగనా ఇప్పుడు చట్ట సభల్లో బిజీ కానుంది.


ఇదిలా ఉంటే కంగనా నటిస్తున్న కొత్త మూవీ ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. వీటికి లోక్ సభ ఎన్నికలు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి.ఈ చిత్రంలో కంగనా ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా.. కథ, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలన్నీ తానే తీసుకుంది. ఈ మూవీ గతేడాది నవంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీని కొత్త రిలీజ్ డేట్‌ను నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాలో ఒక కొత్త పోస్టర్‌ను వదిలింది. ఆ పోస్టర్‌లో కంగనా.. అచ్చం ఇందిరా గాంధీ పాత్రకు సరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో కంగనా రనౌత్‌తో పాటు స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, సతీష్ కౌశిక్, శ్రేయస్ తల్పడే వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.


Also Read: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు

ఎమర్జెన్సీ అంటే..?

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1975 నుంచి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. రాజకీయ చరిత్రలో దీనిని ఒక చీకటి అధ్యాయంగా చెబుతారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో మీడియా, ప్రతిపక్ష నేతలు, పౌరుల విషయంలో దారుణాలు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు వాటిని తెరపై చూపించేందుకు కంగనా రనౌత్ ప్రయత్నం చేస్తుంది. మరి ఈ చిత్రం మాజీ ప్రధాని బయోపిక్‌లో తెరకెక్కుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ తర్వాత ఏమైనా వివాదాలు చుట్టుముడతాయా లేదా అనేది చూడాలి.

Related News

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Big Stories

×