BigTV English

Bollywood:ఏడు పదుల వయసులో తల్లి కావాలని కోరుతోంది

Bollywood:ఏడు పదుల వయసులో తల్లి కావాలని కోరుతోంది

Bollywood actress Rekha wants to become mother by giving birth a baby
బాలీవుడ్ ఒకప్పటి అందాల రాశి..టాప్ హీరోయిన్ రేఖ గురించి తెలియనివారుండరు. తన నటనాభినయంతో కట్టిపడేసే అందంతో అలరించారు ఆమె. తమిళంలో ఒకప్పటి అగ్ర హీరో జెమినీ గణేష్, నటి పుష్పవల్లి కి పుట్టిన రేఖ చిన్నతనంలోనే బాలనటిగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అలరించారు. తర్వాత బాలీవుడ్ లో మంచి ఆఫర్లు రావడంతో ముంబాయి షిఫ్ట్ అయ్యారు. తొలి నుంచీ స్వతంత్ర బావాలు కలిగిన రేఖ అందరితో కలిసిమెలిసి వుండే స్వభావం. అయితే రేఖ జీవితం వివాదాస్పదంగా తయారయింది. మొదట్లో హిందీ చిత్ర సీమలో వినోద్ మెహ్రాతో రిలేషన్ షిప్ ఉండేదని అనేవారు. తర్వాత అమితాబ్ బచ్చన్ తో కలిసి హిట్ సినిమాలలో నటించి హిట్ పెయిర్ అనిపించుకుంది. ఒకానొక దశలో అమితాబ్, రేఖ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అమితాబ్ మాత్రం తన సహనటి జయబాధురిని పెళ్లిచేసుకుని జీవితంలో స్థిరపడ్డారు.


మల్టీ ట్యాలెంటెడ్ నటి

రేఖ మల్టీ ట్యాలెంటెడ్ నటి.నటనే కాదు డబ్బింగ్ కూడా చెప్పేవారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సినిమాలలో నటించడానికి వచ్చిన కొందరు తారలకు డబ్బింగ్ కూడా చెప్పారు. శ్రీదేవి, జయసుధ, సౌందర్య వంటి నటీమణఉలకు బాలీవుడ్ లో తన గొంతు అరువిచ్చేవారు . నటిగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న రేఖ రెండు వందల చిత్రాలకు పైగా నటించి బాలీవుడ్ చలనచిత్ర సీమపై తనదైన ముద్ర వేశారు. ఉమ్రావ్ జాన్ సినిమాతో జాతీయ నటిగా అవార్డును అందుకుంది. ఆ చిత్రం 1981లో విడుదలయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో ప్లేబ్యాక్ సింగర్ గా అలరించారు. ప్రతినిత్యం యోగా, వ్యాయామం లాంటి సాధనాలతో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేది. ఇప్పటికీ రేఖను చూస్తే ఏడు పదుల వయసు అని ఎవరూ నమ్మరు.


తల్లి ప్రభావం

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ తన తండ్రి జెమినీ గణేశన్ తల్లిని సరిగ్గా చూసుకోలేదని..దాంతో ఆమె పిల్లలను పెంచడం ఎంతో కష్టంగా మారిందన్నారు. ఆమె పడిన కష్టాలు తలుచుకుంటే ఇప్పటికీ బాధగానే ఉంటుందని తన కెరీర్ పై ఆ ప్రభావం ఉందని..అందుకే అప్పట్లో పిల్లలు వద్దనుకుని ఒంటరి జీవితానికి అలవాటు పడ్డానంటోంది. అయితే ఇప్పుడు మాత్రం నాకు పిల్లలు కావాలని అనుకుంటున్నానని అంటోంది రేఖ. అయితే రేఖ కోరిక విని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వయసులో అది సాద్యమయ్యే పని కాదు కాబట్టి ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి పిల్లలను తెచ్చుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×