Actress : సినిమా ఇండస్ట్రీలో హీరోల హవానే ఎక్కువగా నడుస్తుంది. ఆరు పదుల వయసు వచ్చినా, కూతురు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు అనే విమర్శలు ఎదుర్కొన్న స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ టైమ్ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ. పదేళ్ళకు మించితే హీరోయిన్లకు ఎక్స్ పైరీ డేట్ అయిపోయినట్టే. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మారుతోంది. అయితే గతంలోనే కొంతమంది హీరోయిన్లు తమకంటే తక్కువ ఏజ్ ఉన్న హీరోలతో రొమాన్స్ చేసి సంచలనం సృష్టించారు. ఆ సినిమాల్లో చాలా ఘాటు సన్నివేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలకు సంబంధించి చాలా వివాదాలే నడిచాయి. ఇక ఆ సినిమాల ఆసక్తికరమైన కథలను తెలుసుకుందాం పదండి.
కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) – అర్జున్ కపూర్ (Arjun Kapoor)
ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ – అర్జున్ కపూర్ మధ్య దాదాపు 5 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. కానీ వారిద్దరూ ‘కి అండ్ కా’ చిత్రంలో కలిసి పని చేశారు. ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగా నటించారు. అలాగే ఈ మూవీలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ మూవీ 2016 ఏప్రిల్ 1న విడుదలైంది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) – రణబీర్ కపూర్ (Ranbir Kapoor)
ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ – రణబీర్ కపూర్ ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఇందులో వీరిద్దరి మధ్య ఉన్న లిప్ లాక్ సీన్స్ తో పాటు, మరికొన్ని ఘాటు సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రణ్‌బీర్ ఐశ్వర్య కంటే 9 సంవత్సరాలు చిన్నవాడు. అయినప్పటికీ ఈ మూవీలో వీరిద్దరూ రెచ్చిపోయి అలాంటి సీన్స్ లో దర్శనం ఇచ్చారు.
బిపాసా బసు (Bipasa Basu) – కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)
హీరోయిన్ బిపాసా బసు కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి ‘అలోన్’ చిత్రంలో నీతినచ్చింది. అప్పటి నుండే వారి మధ్య ప్రేమ మొదలైంది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ సినిమాలో మొదలైన లవ్ ను పెళ్లి బంధంతో ఇంకా బలపరిచారు ఈ జంట. కరణ్ బిపాసా కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు.
అక్షయ్ కుమార్ (Akshay Kumar) – రేఖ (Rekha)
అక్షయ్ కుమార్ – రేఖ మధ్య దాదాపు 13 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ‘ఖిలాడియోం కా ఖిలాడి’ చిత్రంలో వారిద్దరూ కలిసి వెండి తెరను పంచుకున్నారు. అలాగే వీరిద్దరి మధ్య ఈ సినిమాలో చాలానే ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి.
రణబీర్ కపూర్ (Ranbir Kapoor) – కొంకణ సేన్ శర్మ (Konkana Sen Guptha)
రణబీర్ కపూర్, కొంకణ సేన్ శర్మ ‘వేక్ అప్ సింద్’ చిత్రంలో హీరోహీరోయిన్లుగా స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఇందులో ఇద్దరి మధ్య చాలా ప్రేమ కోణాలను చూపించారు. ఇలా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తమకంటే చిన్న వయసు ఉన్న హీరోలతో రొమాన్స్ చేసి, కొత్త ట్రెండ్ సృష్టించారు. కానీ టాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ ఊహకు కూడా అందదేమో !!