Today Gold Rate: పెళ్లిళ్లు, సుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం మాత్రమే. అంతగా బంగారం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ముడిపడి ఉంది. అంతేకాదు పెట్టుబడిపెట్టాలనుకునే వారికి కూడా పసిడి అనేది సాధనం అనే చెప్పుకోవాలి. బంగారంతో పాటు, వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. అందుకు వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో బంగారం ధరలు చూస్తే.. దాదాపు తులం రూ.86,000 వరకు దాటింది. ఇక ట్రంప్ రాకతో అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ బాగా పెరిగింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం పతనం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్, పండుగలు మొదలు కాబోతున్నాయి. దీంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేవారు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే మరో ఆరునెలల వరకు ఇదే రేట్లు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈలోపే లక్ష దాటిన కూడా ఆశ్చర్యపోవాల్సన అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. దేశ వ్యాప్తంగా పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,600 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,820 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 వద్ద కొనసాగుతోంది.
కోల్ కతా, కేరళలో పసిడి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: సిబిల్ స్కోర్‌తో పెళ్లి క్యాన్సిల్.. వరుడికి షాకిచ్చిన అత్తమామలు
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 ఉంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,450 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,670 పలుకుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా పరుగులుపెడుతోంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,07,000 పలుకుతోంది.
ముంబై, ఢిల్లీ,కోల్ కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.99,500 వద్ద కొనసాగుతోంది.