BigTV English

Kantara2 : ‘కాంతార 2’లో బాలీవుడ్ బ్యూటీ .. ఫొటోతో క్లారిటీ ఇచ్చిందా!

Kantara2 : ‘కాంతార 2’లో బాలీవుడ్ బ్యూటీ .. ఫొటోతో క్లారిటీ ఇచ్చిందా!
Bollywood beauty in 'Kantara 2'

గ‌త ఏడాది మీడియం బ‌డ్జెట్‌తో రూపొంది పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.450 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తనే తెరకెక్కించిన చిత్రమది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి కొన‌సాగింపుగా ‘కాంతార 2’ (kantara2) ఉంటుంద‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.


కాంతార సాధించిన విజ‌యంతో ‘కాంతార 2’పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీంతో మేక‌ర్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది.

బాలీవుడ్ కంటే ఈ మ‌ధ్య ఊర్వ‌శీ రౌతేలా తెలుగు, త‌మిళ చిత్రాల‌పైనే ఫోక‌స్ చేస్తుంది. ఆమె ఎంపిక చేసుకుంటున్న సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇప్ప‌టికే త‌మిళంలో శ‌ర‌వ‌ణ‌న్ హీరోగా న‌టించిన లెజెండ్ మూవీలో హీరోయిన్‌గా న‌టించింది. రీసెంట్‌గా విడుద‌లైన వాల్తేరు వీర‌య్య‌లోనూ స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడింది. అలాగే రామ్‌, బోయ‌పాటి శ్రీను పాన్ ఇండియా మూవీలోనూ ఊర్వ‌శి ఓ సాంగ్‌లో న‌ర్తించింద‌ని టాక్‌. ఇప్పుడు కాంతార 2లో న‌టిస్తుంది.


మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌లేదు. కానీ ఊర్వ‌శి.. రిష‌బ్ శెట్టితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కాంతార 2 లోడింగ్ అని పెట్టిన‌ పోస్ట్ చూస్తుంటే అంద‌రికీ అదే డౌట్ వ‌స్తుంది. ఇదే క‌నుక నిజ‌మైతే ఊర్వ‌శీ రౌతేలాకి మంచి బ్రేక్ దొరికిన‌ట్టేన‌ని చెప్పాలి.

కె.జి.యఫ్ వంటి సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ ‘కాంతార 2’ నిర్మించ‌టం సినిమాకు క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. క‌న్న‌డ‌లో ఘ‌న విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని వారు హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాదం చేసి విడుద‌ల చేశారు. వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా కాంతార అన్నీ భాష‌ల్లో క‌లిపి పాన్ ఇండియా రేంజ్‌లో రూ.450 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×