Mannara Chopra : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. గత నెల రోజులుగా పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. నిన్నకాక మొన్న ముకుల్ దేవ్ చనిపోయారు. అదే విధంగా ఎంతో మంది డైరెక్టర్స్ గుండెపోటుతో మరణించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు మరణించారు. వరుసగా ప్రముఖ నటుల మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర కలవర పెడుతుంది.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీరోయిన్ తండ్రి మరణించారు. మన్నారా తండ్రి రమణ్ రాయ్ హండా మృతి చెందారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యల తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలిపారు.. ఆమెకు దైర్యంగా ఉండమని పోస్టులు పెడుతున్నారు..
మన్నారా చోప్రాకు పితృవియోగం..
బాలీవుడ్ నటి మన్నారా తండ్రి వయోభారంతో అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మృతి చెందారు. మరణంతో చోప్రాస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెల్సిన పలువురు ప్రముఖులు మన్నారాకు సానుభూతి తెలుపుతున్నారు. ఆయన మరణం పట్ల కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. అంత్యక్రియలు జూన్ 18 న వెస్ట్ అంధేరిలో జరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.. నివాళులు అర్పించారు.. ఆయన అంత్యక్రియలకు బాలీవుడ్ లోని ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్..
మన్నారా సినిమాల విషయానికొస్తే..
మన్నారా బాలీవుడ్ హీరోయిన్ అయిన కూడా తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో విడుదలైన ప్రేమ గీమ జాన్‌తా నయ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత సునీల్ హీరోగా నటించిన జక్కన్న చిత్రంలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. సీత సినిమా లో కాజల్ కు అసిస్టెంట్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలకు బంధువే అన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ లో సందడి చేసింది.
హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని మరింత గుర్తింపును తెచ్చుకుంది. ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ మధ్య తెలుగులో పెద్దగా ప్రాజెక్టులు చెయ్యలేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన్నారా ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి..