OTT Movie : చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో, హర్ష్, కార్తికేయ, స్టీవెన్ ఆన్ ముగ్గురు టీనేజ్ బాయ్స్ స్నేహితులుగా ఉంటారు. తమ జీవితాల్లో ఉత్సాహం లేక, కెమెరా కొనాలనే కలతో తిరుగుతుంటారు. అందుకోసం డబ్బు సంపాదించడానికి వినాయక చవితి చందా సేకరణ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒక పాత స్కూటర్‌ను ఆటో-రిక్షాగా మార్చినప్పుడు, అది ఊహించని విధంగా జీవం పోసుకుంటుంది. అది ప్రశ్నలకు సమాధానమిస్తూ, స్వయంగా కదులుతూ ఈ గ్రామంలో సంచలనంగా మారుతుంది. తరువాత దాని వెనుక ఒక ఆత్మ ఉందని తెలిసినప్పుడు వీళ్ళ ప్రపంచం తలకిందులవుతుంది. ఈ ఆత్మ ఎవరు? ఆ స్కూటర్‌లో ఎందుకు చిక్కుకుంది? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఉండే ఒక గ్రామంలో ఈ స్టోరీ నడుస్తుంది. అక్కడ ముగ్గురు టీనేజ్ బాయ్స్ హర్ష్, కార్తికేయ, స్టీవెన్ జీవితంలో ఏ లక్ష్యం లేకుండా ఉంటారు. అ*డల్ట్ వీడియోలు చూస్తూ, సోమరితనంతో రోజులు గడుపుతుంటారు. వీళ్ళు డబ్బులు బాగా సంపాదించడానికి ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తారు. గ్రామంలో స్త్రీల స్నాన వీడియొ లను రహస్యంగా రికార్డ్ చేసి అమ్మాలని ప్లాన్ చేస్తారు. కెమెరా కొనడానికి వినాయక చవితి ఉత్సవంలో గణపతి విగ్రహ ప్రొసెషన్‌కు సేకరణ చేయాలని నిర్ణయిస్తారు. ఈ సమయంలో ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ వీళ్ళ కంటికి కనబడుతుంది. దాన్ని రిపేర్ చేసి మూడు చక్రాల ఆటో-రిక్షాగా మారుస్తారు. దీనికి ‘టుక్ టుక్’ అని పేరు పెడతారు. ఈ ఆటో గణపతి విగ్రహాన్ని మోసేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటారు.
అయితే ఊహించని విధంగా అది స్వయంగా కదలడం, ప్రశ్నలకు హ్యాండిల్ తో సమాధానమివ్వడం మొదలుపెడుతుంది. మొదట బాయ్స్ దీన్ని దేవుడి శక్తిగా భావిస్తారు. కానీ తర్వాత టుక్ టుక్‌లో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. ఈ ఆత్మ కూడా ఒక అమ్మాయిది అని తెలిసి షాక్ అవుతారు. శిల్పా అనే ఒక అమ్మాయి తన ఫైల్యూర్ లవ్ స్టోరీతో ఆత్మగా మారిపోతుంది. చివరికి ఈ ఆత్మ టుక్ టుక్‌లోకి ఎలా వచ్చింది ? శిల్పా అసలు స్టోరీ ఏమిటి ? బాయ్స్ ఈ సమస్యను ఎలా ఎదుర్కుంటారు ? అమ్మయిల వీడియొలు తీసే ఆలోచనలను మానుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : తల్లి దండ్రుల మధ్య చిచ్చు పెట్టే కొడుకు … దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు …
ఈ మూవీ సూపర్ నాచురల్ కామెడీ మూవీ పేరు ‘టుక్ టుక్’ (Tuk Tuk). 2025 మార్చి 21 న థియేట్రికల్ రిలీజ్ అయింది. దీనికి సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించారు.ఇందులో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 10 నుంచి ETV Win లో స్ట్రీమింగ్ అవుతోంది.