E-Paper
Advertisement

Chhaava OTT : సడెన్ గా ఓటీటీలోకి ‘ఛావా’ ఎంట్రీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Chhaava OTT :  సడెన్ గా ఓటీటీలోకి ‘ఛావా’ ఎంట్రీ.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Chhaava OTT : 2025 లో బాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి మూవీ ‘ఛావా’.. థియేటర్లలోకి రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ సక్సెస్ అయింది.. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా రూపొందిన ఇది ప్రభంజనాన్ని సృష్టించింది. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైంది. భారీ కలెక్షన్లను సాధించింది. ఇక మార్చిలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇప్పటికి పలు చోట్ల ఛావా హంగామానే కొనసాగుతుంది.. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఎక్కడ చూడాలో ఒకసారి తెలుసుకుందాం..

‘ఛావా’ ఓటీటీ..

Advertisement

విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఛావా.. మంచి బిజినెస్ తో థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అలాగే ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వస్తుందని అనుకున్నారు. అనుకున్నట్లు గానే మూవీ నేడు అర్ధరాత్రి స్ట్రీమింగ్ కు రాబోతుంది.

థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ మూవీ అటు ఓటిటిలో కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు రూ.780కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇంకా కాస్త థియేట్రికల్ రన్ సాగుతోంది. సుమారు రూ.140కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఆస్థాయి భారీ వసూళ్లతో దుమ్మురేపింది.. ఇక ఇందులో అక్షయ్ ఖన్నా, అషుతోశ్ రాణా, డయానా పెంటీ, నీల్ భూపాలమ్, దివ్య దత్తా కీలక పాత్రలను పోషించారు.

Advertisement

Also Read :బోయపాటి – బాలయ్య మధ్య విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్..!

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక మూవీ ఛావా.. ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. మరాఠా యోధుడు ఛత్రవతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.. చరిత్రను తలపించేలా స్టోరీ ఉండటంతో ఆడియన్స్ ప్రశంసలు దక్కాయి. సంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించి మెప్పించాడు.. రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. థియేటర్లలో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

విక్కీ కౌశల్ బాలీవుడ్ మరో ప్రాజెక్టులో నటిస్తున్నాడు. రష్మిక మందన్న మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×