Akhanda 2 : నందమూరి స్టార్ హీరో నరసింహం బాలయ్య ఇటీవల డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ఈ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటితో అఖండ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. పూజా కార్యక్రమాలతో ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని థియేటర్లలో ఎప్పుడు చూస్తామని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగు ఆగిపోయిందని వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నారు. అటు సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
బాలయ్య- బోయపాటి మధ్య విభేదాలు..
అఖండ 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక రకాల పూకార్లు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందుకు కారణం బాలయ్యకు అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు మధ్య గొడవలు జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఆ గొడవలు వల్లే షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని ఈ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.. బాలకృష్ణ, బోయపాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వీరిద్దరూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశాయి. ‘అఖండ 2’ షూటింగ్ సజావుగా జరుగుతోందని, ఏ మాత్రం అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. స్టోరీ అనుకున్న దానికన్నా బాగానే షూటింగ్ జరుగుతుందని టీమ్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రం గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : ప్చ్.. అదంతా నిజం కదా.. జనాలను బకరాలను చేశారా..?
స్టోరీ విషయానికొస్తే..
గతంలో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్య ద్విపాత్రాభినయం, పవర్‌ఫుల్ డైలాగ్స్, మ్యూజిక్ ఇలా అన్ని బాగా వక్ కావడం తో ఇప్పుడు సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. బోయపాటి శ్రీను మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి న్యాయం చేయబోతున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ 2’ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ లో నటించిన చాలా మంది ఇందులో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు గురువుగా మురళీమోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది..