BigTV English

Sunny Deol: అందుకే షారుక్ తో 30 ఏళ్ళు మాట్లాడలేదు – సన్నీ దేవోల్..!

Sunny Deol: అందుకే షారుక్ తో 30 ఏళ్ళు మాట్లాడలేదు – సన్నీ దేవోల్..!

Sunny Deol: సాధారణంగా సినీ సెలెబ్రిటీల మధ్య విభేదాలు ఉండడం సహజం. కానీ ఆ విభేదాలు దశాబ్దాల తరబడి కొనసాగడం అంటే నిజంగా ఆశ్చర్యం అనే అనిపిస్తుంది. అయితే అన్ని సంవత్సరాలు పాటు మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ (Sharukh Khan),నటుడు సన్నీదేవోల్ (Sunny Deol) మధ్య 32 ఏళ్లుగా మాటలు లేవని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇన్నేళ్లుగా వీరి మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏంటి? వీరి మధ్య ఏం జరిగింది ? అనే విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.


32 ఏళ్లుగా మాటలు లేవు..

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా ,నటుడు సన్నీ దేవోల్ కలసి నటించిన చిత్రం ‘డర్’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు సమాచారం. ఆ సినిమా తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే సుమారు 32 ఏళ్ల తర్వాత తమ మధ్య నెలకొన్న వివాదం గురించి తొలిసారి నటుడు సన్నీ దేవోల్ స్పందించారు. జరిగిందేదో జరిగిపోయింది. నాటి గొడవల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు.


జరిగిందేదో జరిగిపోయింది.. గొడవలపై క్లారిటీ..

సన్నీ దేవోల్ మాట్లాడుతూ.. “డర్ సినిమా షూటింగ్ సమయంలో ఏదైతే జరిగిందో దానికి నేను ఏమాత్రం బాధపడడం లేదు జరిగిందేదో జరిగిపోయింది. అయితే అది గడిచిన కాలం. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ఆ తర్వాత అందరికీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు మళ్లీ ఆ నాటి విషయాలను గుర్తు చేసుకొని మాట్లాడడం వల్ల కలిగే ఉపయోగం ఏమీ లేదు. అలా కాని పక్షంలో మనం జీవితంలో ముందుకు ఎలా సాగుతాం” అంటూ ఆయన అన్నారు. తనకు ఎంతో మంది నటులతో మల్టీ స్టారర్ చిత్రాలలో నటించే అవకాశం రావాలి అని, అందులో షారుక్ పేరు కూడా ఉందని తెలిపారు. మొత్తానికైతే 32 ఏళ్ల తర్వాత నాటి సమస్యలను మరిచిపోయి , మళ్లీ షారుక్తో పనిచేయాలని చూస్తున్న సన్నీ దేవోల్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు..

అసలు ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటి?

అసలు విషయంలోకి వెళితే, యశ్ చోప్రా దర్శకత్వంలో సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించిన చిత్రం డర్. ఇందులో తన పాత్ర కంటే షారుక్ ఖాన్ పాత్రని ఎక్కువగా హైలెట్ చేసేలా చూపించడం పై సన్నీదేవోల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిత్ర బృందంతో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి షారుక్ – సన్నీ దేవోల్ మధ్య మాటలు కూడా కరువయ్యాయి. ఇందులో తాను నటించి తప్పు చేశాను. అబద్దాలతో విసిగిపోయాను. వాళ్ళు నా నమ్మకం పై దెబ్బ కొట్టారు. అందుకే మళ్ళీ వారితో కలిసి వర్క్ చేయను” అని సన్నీ దేవోల్ అప్పట్లో చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు మళ్లీ షారుక్ ఖాన్ తో నటించాలని ఉంది అని చెప్పడంతో మళ్ళీ నాటి విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి .

Prabhas: 25 కోట్లు నష్టపోయిన ప్రభాస్.. ఏం జరిగిందంటే..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×