Keerthy Suresh: సౌత్‌లో ఎంత పాపులారిటీ లభించినా కూడా కొందరు హీరోయిన్స్‌కు మాత్రం బాలీవుడ్‌లో అడుగుపెట్టాలనే ఆశలు ఉంటాయి. అలా బాలీవుడ్‌కు వెళ్లి ఎదురుదెబ్బ తగిలినా కూడా ఆ హీరోయిన్స్‌కు అక్కడే సెటిల్ అవ్వాలనే కోరిక బలంగా ఉండిపోతుంది. అయితే చాలామంది నటీమణులు బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత చాలా మారిపోతారని ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. ఆ లిస్ట్‌లో తాజాగా కీర్తి సురేశ్ కూడా యాడ్ అయ్యింది. సౌత్‌లో మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేశ్.. బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తన అప్పీయరెన్సే మార్చేసింది. ఇప్పటికీ బీ టౌన్‌లో మరో మూవీ సైన్ చేసి అక్కడే బిజీ అయిపోనుంది ఈ ముద్దుగుమ్మ.
షాక్‌లో ఫ్యాన్స్
వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబి జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేశ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ మూవీకి సరిపడా ప్రమోషన్స్ జరగడానికి మాత్రం కీర్తినే కారణమని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘బేబి జాన్’ షూటింగ్ పూర్తయ్యి, విడుదల కాకముందే ఆంటోనీ తట్టిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కీర్తి. పెళ్లయిన వెంటనే ఈ మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చింది. కానీ అప్పటికే ఒక్కసారిగా తన అప్పీయరెన్స్ అంతా మారిపోయింది. మరీ మోడర్న్‌గా తయారయ్యింది. అదంతా చూసి ఫ్యాన్స్ షాక్ అవ్వక తప్పలేదు.
కీర్తి గ్రీన్ సిగ్నల్
‘బేబి జాన్’ సినిమాలో కీర్తి సురేశ్ (Keerthy Suresh) ట్రెడీషినల్‌గానే కనిపించింది. కానీ ప్రమోషన్స్‌లో మాత్రమే గ్లామర్ షోతో రెచ్చిపోయింది. దీంతో బాలీవుడ్‌కు వెళ్లగానే కీర్తి పూర్తిగా మారిపోయిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఇక తను అక్కడే సెటిల్ అయిపోతే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో అని డిస్కషన్ మొదలుపెట్టారు. ఇంతలోనే కీర్తి సురేశ్ త్వరలోనే మరొక బాలీవుడ్ మూవీలో కనిపించనుందని వార్తలు మొదలయ్యాయి. కానీ ఇప్పటివరకు హిందీలో తన తరువాతి ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. తాజాగా బీ టౌన్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. రాజ్‌కుమార్ రావుతో సినిమా చేయడానికి కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Also Read: సక్సెస్‌తో పాటు అవమానాలు కూడా.. కృష్ణవంశీ హీరోయిన్.!
కథ ఫిక్స్
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యి మంచి గుర్తింపు సాధించాడు రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao). తాజాగా తను, తన భార్య పత్రలేఖతో కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాడు. ఒక మంచి కథ దొరికితే నిర్మించాలని ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో తనకు ఒక కథ నచ్చిందని, అందులో రాజ్‌కుమార్ రావు.. కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్నాడని సమాచారం. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాడట రాజ్‌కుమార్ రావు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి అప్పుడే బాలీవుడ్ ప్రేక్షకుల్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. రాజ్‌కుమార్ రావు, కీర్తి సురేశ్ జోడీ స్క్రీన్‌పైన ఎలా ఉంటుందో చూడాలని ఎదురుచూస్తున్నారు.