Mukul Dev Died: ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రభాస్ (Prabhas ) విలన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ముకుల్ దేవ్ (Mukul Dev)మరణించారు . ప్రస్తుతం ఈయన వయసు 54 సంవత్సరాలు. తల్లిదండ్రుల మరణం తర్వాత గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఈయన.. అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్లో చేరారు. ఇక ఈయన మరణానికి కారణం అనారోగ్యమని తెలుస్తోంది. కానీ ఆ అనారోగ్యానికి కారణం ఏంటి? అనే విషయాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ , అదుర్స్ తదితర చిత్రాలలో నటించిన ఈయన ఏక్ నిరంజన్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన నటుడు రాహుల్ దేవ్ (Rahul Dev) కి స్వయానా తమ్ముడు కూడా. ప్రస్తుతం ఈయన లేరు అనే విషయాన్ని ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతోంది.
ముకుల్ దేవ్ సినీ ప్రస్థానం..
ప్రముఖ ఇండియన్ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న ముకుల్ దేవ్.. 1970 సెప్టెంబర్ 17న ఢిల్లీలో హరిదేవ్ వ కౌశల్, అనూప్ కౌశల్ దంపతులకు జన్మించారు తన చదువును ఢిల్లీలో పూర్తి చేశారు. 1996లో హిందీలో విడుదలైన ‘దస్తక్’ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, బెంగాలీ, మలయాళం, కన్నడ, పంజాబీ వంటి పలు భాషా చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 1996 మొదలు 2001 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసి మెప్పించిన ఈయన 2003లో తొలిసారి పంజాబీ చిత్రం ‘హవాయే’ ద్వారా అక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.
ముకుల్ దేవ్ నటించిన తెలుగు చిత్రాలు..
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ముకుల్ దేవ్ కి 2008లో రవితేజ (Raviteja) హీరోగా నటించిన ‘కృష్ణ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి విలన్ గా పరిచయమయ్యే అవకాశం లభించింది. అలా మొదటి సినిమాతోనే తన నటనతో ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత 2009లో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ‘సిద్ధం’, ‘కేడీ’, ‘అదుర్స్’, ‘బెజవాడ’, ‘మనీ మనీ మోర్ మనీ’ తో పాటూ చివరిగా 2013లో వచ్చిన భాయ్ అనే సినిమాతో తెలుగు దూరమయ్యారు. ఇక తర్వాత పంజాబీ, కన్నడ, హిందీ, గుజరాతీ,మలయాళం, ఇంగ్లీష్ వంటి భాషల్లో నటించి ఆకట్టుకున్నారు. 2019 తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక ఇప్పుడు తుది శ్వాస విడవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ:Sridevi: స్టార్ సెలబ్రిటీలను ఫాలో అవుతున్న కోర్ట్ బ్యూటీ.. వర్కౌట్ అవుతుందా..?