Electric Shock: విజయవాడలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ బెంజ్ సర్కిల్.. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకుంది.
Also Read: పెళ్లి జరిగిన కొన్ని రోజలకే గొడవపడి వెళ్లిపోయిన వధువు.. బ్రోకర్‌ని హత్య చేసిన వరుడు
నారా చంద్రబాబు నాయుడు కాలనీలో రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం నివాసమంటున్నారు. ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి అన్ని సర్దుకున్నారు. ఇంటి ముందున్న ఐరన్ తీగకు బట్టలు ఆరేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. ఆమెను కాపాడేందుకు వెళ్ళి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. మృతుల్లో ప్రసాద్(61), ఆయన భార్య హేమ వాణి(54), చెల్లెలు ముత్యావల్లి(55)గా గుర్తించారు. భాధితుడు ప్రసాద్ లారీ డ్రైవర్ గా పని చేస్తాడు.. ఈ ఘటన ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
ఈ దురదృష్ట ఘటనపై విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకర మన్నారు.కరెంట్ కేబుల్, బట్టలు ఆరేసే తాడు కలిపి ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
వాచ్‌మెన్ అప్రమత్తమై ఫీజ్ తీసే లోపే ప్రాణాలు పోయాయి తెలిపారాయన. ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానన్న ఆయన.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.