Sridevi: శ్రీదేవి.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ దర్శకుడు కంట్లో పడ్డ ఈమెకు నాని (Nani)నిర్మాణంలో.. ప్రియదర్శి (Priyadarshi ), శివాజీ (Sivaji) ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘కోర్ట్’ మూవీలో జాబిలి పాత్ర లభించేలా చేసింది. ముఖ్యంగా సూపర్ హిట్ పాటలకు రీల్స్ చేస్తూ అదిరిపోయే డైలాగ్ లకు తన గొంతు కలుపుతూ ఒక మోస్తారు పేరు సొంతం చేసుకున్న శ్రీదేవి.. ఇప్పుడు కోర్ట్ మూవీలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.. ముఖ్యంగా తన డాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఈ సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ ఇటీవల ఉత్తమ డెబ్యూ ఫిమేల్ విభాగంలో ‘అప్సర అవార్డు’ను కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె స్టార్ సెలబ్రిటీలను ఫాలో అవుతున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
స్టార్ సెలబ్రిటీలను ఫాలో అవుతున్న శ్రీదేవి..
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా సక్సెస్ కోసం లేదా సినిమాలలో ఆఫర్ల కోసం లేదా ఇంకా ఏదైనా మంచి జరగడం కోసం ఎక్కువగా ‘కరుంగళి మాల’ ధరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) మొదలుకొని డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraju), ప్రముఖ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) మాత్రమే కాదు ప్రముఖ రాజకీయ నేత , స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఈ కరుంగళి మాల ధరించారు. అంతేకాదు సమంత(Samantha ), సాయి పల్లవి(Sai Pallavi) లాంటి స్టార్ హీరోయిన్లు కూడా తమ చేతిలో ఈ కరుంగళి మాలతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక వీరంతా కూడా ఈ మాల ధరించిన తర్వాత తమ జీవితంలో ఊహించని మార్పులు చూసాము అని చెప్పుకొచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్టార్ సెలబ్రిటీస్ దారిలోనే యంగ్ బ్యూటీ శ్రీదేవి కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
దాని ప్రభావం.. ఈమె జీవితాన్ని మార్చేసేనా.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ బటర్ ఫ్లై డ్రెస్ ధరించి తన అందంతో మరొకసారి యువతను ఆకట్టుకుంది.. ఇక్కడ అందరినీ స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది మాత్రం ఆమె మెడలో ఉన్న కరుంగళి మాల. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా శ్రీదేవి కూడా ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలను ఫాలో అవుతోంది. ఒక సినిమాతో గుర్తింపు లభించినంత మాత్రాన వరుస అవకాశాలు రావాలని లేదు కదా.. అందుకే ఆ అవకాశాలు రావాలని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగినంత అదృష్టం కూడా కలిసి వచ్చేలా శ్రీదేవి ఇలా తన మెడలో కరుంగళి మాల ధరించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీదేవి ఇలా కరుంగళి మాల ధరించడం వెనక అసలు కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కరుంగళి మాల ఫలితాలను బట్టి చూస్తే సక్సెస్ కోసమే శ్రీదేవి ఇలా ఈ మాల ధరించి ఉంటుంది అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు మరి శ్రీదేవి దీనిని ధరించడం వెనుక అసలు కారణమేమిటో ఆమె స్పందించే వరకూ తెలియదనే చెప్పాలి. మరోవైపు ఈ కరుంగళి మాల ప్రభావం శ్రీదేవి కెరియర్ కు ఏ రకంగా ఉపయోగపడుతుందో చూడాలి.