Devara 2 : గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన దేవర (Devara) సినిమాకి సీక్వెల్ గా.. దేవర 2 (Devara-2) సినిమా కూడా రాబోతుందని చివర్లో డైరెక్టర్ దేవర-2 0పై హైప్ పెంచేశారు. కానీ దేవర సినిమా ఆకట్టుకోకపోవడంతో దేవర-2 పై అంచనాలైతే ఎక్కువగా లేవు. దీంతో దేవర-2 పై అంచనాలను పెంచడం కోసం దర్శక నిర్మాతలు సినిమాకి హైప్ ఇచ్చే న్యూస్ లు ఎన్నో సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప -2(Pushpa-2) లెవెల్లో దేవర-2 లో విజువల్స్,యాక్షన్ సీన్స్ ఉంటాయని ఓ న్యూస్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజాగా దేవర 2 కి సంబంధించి మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
దేవర 2 లో రణవీర్ సింగ్..
అదేంటంటే దేవర-2 లో ఎన్టీఆర్ (NTR)తో పాటు మరో బాలీవుడ్ బిగ్గెస్ట్ హీరో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ దేవర-2 లో నటిస్తున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ చేస్తున్న దేవర 2 మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వార్-2 (War 2) అలాగే ఎన్టీఆర్ 31(Ntr31) మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవర-2లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) కూడా భాగమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కొరటాల శివ తన మార్క్ డైరెక్షన్ తో ఈ సినిమాలో రణవీర్ సింగ్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రని డిజైన్ చేసినట్టు సమాచారం.
ఎన్టీఆర్,రణవీర్ సింగ్ కాంబోలో ..
ఇక రణవీర్ సింగ్ , ఎన్టీఆర్ కాంబోలో కొన్ని సీన్స్ కూడా ఉంటాయని, ఆ సీన్స్ కు సంబంధించి మంచి కథ కూడా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే జూనియర్ ఎన్టీఆర్,రణవీర్ సింగ్ కాంబోలో దేవర 2 సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అంటూ అటు బాలీవుడ్ అభిమానులతో పాటు ఇటు సౌత్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు రణవీర్ సింగ్ కి సంబంధించిన రూమర్ లో ఎంత నిజం ఉందో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.మరి దేవర-2 లో నిజంగానే ఎన్టీఆర్ తో పాటు రణవీర్ సింగ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా..? లేక ఇది సోషల్ మీడియాలో వచ్చే రూమరేనా? అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.
దేవర 2 పై వార్ 2 ఎఫెక్ట్ పడనందా..?
ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి భారీ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అందుకే దేవర 2 సినిమా కోసం బాలీవుడ్లో మరింత ఫోకస్ చేస్తున్నారు. ఇక దీంతోపాటు ఒక బాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాలో ఉంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకే అక్కడ భారీ పాపులారిటీ అందుకున్న రన్వీర్ సింగ్ ని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.