India Passport Rules Change| పాస్‌పోర్ట్‌ల జారీకి సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక మార్పులు చేసింది. పాస్‌పోర్ట్‌ల కోసం సమర్పించే పుట్టిన తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు.. 2025లో పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.
నిబంధనల్లో కీలక మార్పులు
2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు, జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అధికార సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా నిర్దేశించబడింది. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.
2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించే రుజువులు మరింత సరళంగా ఉంటాయి. అందుకోసం ఈ కింది డాక్యుమెంట్లను పుట్టిన తేదీ రుజువుగా ఆమోదించబడ్డాయి.
Also Read: పాస్ పోర్ట్, ఐడి కార్డ్ లేకుండానే విమాన ప్రయాణం.. త్వరలో కొత్త టెక్నాలజీ!
కొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా ఆ తరువాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్‌పోర్ట్ దరఖాస్తులకు పుట్టిన తేదీకి ఏకైక రుజువుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డులలో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించినవారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్‌పోర్ట్ కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల పుట్టిన తేదీ రుజువులను సమర్పించవచ్చు.