BigTV English

Rose Water: ఖరీదైన క్రీములు అవసరమే లేదు, రోజ్ వాటర్ ఇలా వాడితే.. అందం రెట్టింపు

Rose Water: ఖరీదైన క్రీములు అవసరమే లేదు, రోజ్ వాటర్ ఇలా వాడితే.. అందం రెట్టింపు

Rose Water : గులాబీ రేకులతో తయారుచేసిన రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇది మన చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు దాని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చర్మ కాంతిని పెంచడమే కాకుండా ముఖంపై మొటిమలు, నల్లటి వలయాలు, ముడతలు మొదలైన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.


రోజ్ వాటర్‌లో ఆస్ట్రింజెంట్ ఉంటుంది. మార్కెట్లో లభించే ఖరీదైన టోనర్లను ఉపయోగించే బదులు, మీ చర్మాన్ని టోన్ చేయడానికి రోజ్ వాటర్ ఉపయోగించడం మంచిది. మీరు దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 30 రోజులు రోజ్ వాటర్ ముఖానికి వాడటం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రోజ్ వాటర్ 30 రోజులు రెగ్యులర్‌గా వాడితే ఎన్ని లాభాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ చర్మంపై ఉన్న ముఖ రంధ్రాలు తెరుచుకుని ఉంటే, వాటిని శుభ్రం చేయడానికి మీరు ఈ రోజ్ వాటర్‌ని మీరు టోనర్‌‌గా ఉపయోగించవచ్చు. చర్మంపై మృత కణాలు పేరుకుపోయి రంగు మారితే దానిని శుభ్రం చేయడానికి ఇది సరైన పద్ధతి. దీంతో పాటు, మీ చర్మంపై మొటిమల సమస్య ఉంటే మీరు రోజ్ వాటర్ వాడటం వల్ల సమస్య పూర్తిగా తొలగిపోతుంది.


అందం రెట్టింపు:

చర్మాన్ని తేమగా ఉంచడానికి మీరు రోజ్ వాటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీనిని అప్లై చేయడం వల్ల మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. డ్రై స్కిన్ సమస్య ఉన్న వారు కూడా రోజ్ వాటర్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం, మీకు రెండు స్పూన్ల రోజ్ వాటర్, ఒక చెంచా గ్లిజరిన్ , ఒక చెంచా కొబ్బరి నూనెలను ఒక మిశ్రమం లాగా చేసి ముఖానికి వాడవచ్చు. ఈ మూడు వస్తువులను కలిపి ఒక సీసా నిల్వ చేసుకొని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు. చర్మానికి తేమను అందించడానికి, రోజుకు రెండు నుండి మూడు సార్లు రోజ్ వాటర్ 30 రోజుల పాటు ముఖంపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మంపై ట్యాన్ తొలగించడం:
ముఖంపై ట్యాన్ తొలగించడంలో రోజ్ వాటర్ కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం మీరు 20 తులసి ఆకులను తీసుకొని, వాటిని మెత్తగా చేసి వాటి నుండి రసం తీయాలి. ఇప్పుడు 200 ml రోజ్ వాటర్, తులసి రసం కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోండి. దీన్ని రోజుకు రెండు నుండి మూడు సార్లు మీ చర్మంపై అప్లై చేయండి. ముఖంపై ట్యాన్ సమస్య 30 రోజుల్లోనే తగ్గిపోతుంది. అంతేకాకుండా మీ చర్మం కూడా మెరుస్తుంది.

1. రోజ్ వాటర్, నిమ్మరసం :

రోజ్ వాటర్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని టోన్ చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం యొక్క మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

2. తేనె, రోజ్ వాటర్ :

రోజ్ వాటర్‌లో తేనె కలిపి ముఖాన్ని తేలికగా మసాజ్ చేయండి. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేస్తుంది. అలాగే, రోజ్ వాటర్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ప్రశాంతపరచడంలో సహాయపడతాయి.

AlsO Read: జుట్టుకు రంగు వేస్తున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి !

3. రోజ్ వాటర్ , కలబంద :

కలబంద జెల్‌లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ మిశ్రమం చర్మానికి లోతైన తేమను అందించి చల్లబరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తాజాగా , ప్రకాశవంతంగా ఉంచుతుంది.

4. టమాటో రసం, రోజ్ వాటర్ :

టమాటో రసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది. టమాటోలో విటమిన్ ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

30 రోజుల పాటు ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీ చర్మం కాంతి వంతంగా మరుతుంది. అంతే కాకుండా మృదువుగా, తాజాగా మారడంతో పాటు యవ్వనంగా కనిపిస్తుంది.

Related News

Shrunken Heads: తలలు నరికి, పుర్రెపై చర్మాన్ని ఒలిచి.. చనిపోయేవాళ్లను ఇక్కడ ఇలాగే చేస్తారు, ఎందుకంటే?

Weight Loss: బరువు తగ్గాలా ? అయితే రాత్రిపూట ఇవి అస్సలు తినొద్దు !

Kidney Health: వీటికి దూరంగా ఉంటేనే.. మీ కిడ్నీలు సేఫ్

Fatty Liver Disease: మహిళలకు ఫ్యాటీ లివర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు

Multani Mitti: ముల్తానీ మిట్టి ఇలా వాడితే.. ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు !

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం ఏం తినాలి ?

Big Stories

×