Banana Peel For Skin: అరటి పండు తిన్న తర్వాత తొక్కలను పారవేస్తారు. కానీ అవి చర్మ సంరక్షణలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ వీటిని ముఖానికి ఎలా ఉపయోగించాలనే విషయం చాలా మందికి తెలియదు. అరటి తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడతాయి.
చర్మానికి కొత్త మెరుపు తీసుకురావడం, మచ్చలను తొలగించడం, మొటిమల సమస్యలకు అరటి తొక్క చాలా మంచి పరిష్కారం. ఈ రోజుల్లో.. కెమికల్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే అరటి తొక్కలను వాడటం మంచిది.
అరటి తొక్కను ముఖానికి ఎలా వాడాలంటే ?
ముడతలను తగ్గించడం:
అరటి తొక్కలు చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. తొక్క లోపలి భాగాన్ని మీ ముఖంపై 5-10 నిమిషాలు సున్నితంగా రుద్దండి. ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మీరు వారానికి 3 సార్లు చేస్తే, మీరు తేడాను చూడటం ప్రారంభిస్తారు.
మొటిమల నుండి ఉపశమనం:
అరటి తొక్కలలో లుటిన్ , జింక్ వంటి అంశాలు ఉంటాయి. ఇవి మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి. ఆ తొక్కను ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా రుద్ది.. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఈ ప్రక్రియను రోజుకు ఒకసారి చేయండి.
చర్మ కాంతి కోసం:
తొక్క లోపలి భాగంలో నిమ్మరసం రాసి దానితో ముఖం మీద మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో , నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని అప్లై చేసిన తర్వాత.. నేరుగా ఎండలోకి వెళ్లకూడదు.
Also Read: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్
కళ్ళ కింద నల్లటి వలయాలు:
అరటి తొక్కను చిన్న ముక్కగా కోసి.. కళ్ళ కింద 10-15 నిమిషాలు ఉంచండి. ఇందులో ఉండే పొటాషియం ,యాంటీఆక్సిడెంట్లు నల్లటి డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడతాయి.
సహజ మాయిశ్చరైజర్:
అరటిపండు తొక్కను ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా ముఖం పొడిబారడాన్ని తొలగిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.