BigTV English

Big Tv Plus Kissik Talks : పెళ్లైన తర్వాత ఫస్ట్ టైం భార్య విషయాలు షేర్ చేసుకున్న బిగ్ బాస్ మానస్… కోపం ఎక్కువే అంటూ…

Big Tv Plus  Kissik Talks : పెళ్లైన తర్వాత ఫస్ట్ టైం భార్య విషయాలు షేర్ చేసుకున్న బిగ్ బాస్ మానస్… కోపం ఎక్కువే అంటూ…

Big Tv Plus Kissik Talks : బుల్లితెర ప్రేక్షకులకు మానస్ నాగులపల్లి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈయన ప్రస్తుతం బుల్లితెరపై హీరోగా పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మానస్ ఎన్నో చిత్రాల్లో నటించి అవార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం సీరియల్ హీరోగా పలు సీరియల్స్ లో నటిస్తూ క్రేజ్ ని అందుకున్నాడు. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మానస్. అయితే తాజాగా మానస్ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా తన భార్య గురించి ఎన్నో కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. ఎప్పుడూ బయట పెట్టని కొన్ని నిజాలను కూడా బయట పెట్టడంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బిగ్ టీవీ ‘కిస్సిక్ టాక్స్’ లో మానస్..

ప్రముఖ ఛానెల్ బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే కార్యక్రమానికి అటు ఆడియన్స్ నుండి ఇటు సెలబ్రిటీల నుండి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాజాగా సీరియల్ హీరో మానస్ నాగులపల్లి విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమని మనకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటినుంచి తాను అందుకున్న అవార్డుల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే తన భార్య వల్ల తన జీవితం ఎలా మారిందో అన్న విషయాల గురించి మానస్ చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


Also Read :బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..

నా భార్యకు కోపం ఎక్కువే.. కానీ.. 

సీరియల్ హీరో మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు. మానస్ మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒక్కో సీరియల్ తో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇటీవలే మానస్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. శ్రీజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది.. వీరిద్దరికి ఒక బాబు పుట్టారు. ఇటీవలే తల్లి దండ్రులు అయ్యారు. ఈ షోలో మానస్ తన భార్య గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.. అయితే వర్షం ఉండి మీ భార్యను స్క్రీన్ మీద చూపించాలనే కోరిక మీకు ఉందా అని అడుగుతుంది. తనకు ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఏది లేదు అలాంటి అసలు నచ్చవు అని చెప్తాడు. అలాగే తనకు కోపం ఎక్కువే అప్పుడప్పుడు నేనే తగ్గి ఉంటాను అని తన భార్య గురించి కీలక విషయాలను షేర్ చేసుకున్నారు.. ప్రస్తుతం ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ ఫుల్ ఎపిసోడ్లో తన సీరియల్ గురించి అలాగే ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అసలు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ను చూసేయ్యండి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×