Boney Kapoor: సినీ పరిశ్రమలో విడాకులు, రెండో పెళ్లి లాంటివి కామన్. అలాగే ఒకప్పుడు శ్రీదేవి, బోనీ కపూర్ వివాహం ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికే దేశవ్యాప్తంగా హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది శ్రీదేవి. తనను పెళ్లి చేసుకోవాలని స్టార్ హీరోలు సైతం కలలు కంటుండేవారు. ప్రేక్షకుల్లో ఎంతోమంది ఆమె అంటే క్రష్ ఉండేది. అలాంటి సమయంలోనే అప్పటికే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్న ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది శ్రీదేవి (Sridevi). తన హఠాన్మరణం ఇండస్ట్రీలో తీరని లోటుగా మిగిలిపోయింది. తాజాగా బోనీ కపూర్ కూడా శ్రీదేవి మృతి గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు.
నా వల్ల కాలేదు
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ (Boney Kapoor).. శ్రీదేవితో తన రిలేషన్ ఎలా ఉండేదో గుర్తుచేసుకున్నారు. బోనీ కపూర్ ముందు నుండే చాలా లావుగా ఉండేవారు. అయితే తను బరువు తగ్గడానికి శ్రీదేవి సాయం చేసిందని ఆయన బయటపెట్టారు. ‘‘ఆ ఆలోచనలు నా భార్య వల్లే కలిగాయి. తను ఎప్పుడూ నన్ను బరువు తగ్గమని వెంటపడుతూ ఉండేది. తను ఆరోగ్యం గురించి చాలా ఆలోచించే వ్యక్తి. నేను తనతోనే వాకింగ్‌కు వెళ్లేవాడిని, జిమ్‌కు వెళ్లేవాడిని. శ్రీదేవి ఎప్పుడు తినాలి, ఏం తినాలి అనే విషయాల్లో చాలా క్లియర్‌గా ఉండేది. తనలాగే నేను కూడా ఉండడానికి చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు’’ అని చెప్పుకొచ్చారు బోనీ కపూర్.
Also Read: అందరి ముందు పరువు పోగొట్టుకున్న రష్మిక.. సారీ చెప్పక తప్పలేదు!
ఇప్పటికీ ఉంది
శ్రీదేవి మరణం గురించి గుర్తుచేసుకున్న బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యారు. ‘‘శ్రీ ఇప్పటికీ నాతోనే ఉందని నేను ఫీలవుతున్నాను. నా భార్య ఇప్పటికీ నాతోనే ఉంటూ నేను బరువు తగ్గడానికి మోటివేట్ చేస్తుంది. బరువు తగ్గు అని చెప్తూ ఉంది’’ అంటూ ఫీలయ్యారు. 2018 ఫిబ్రవరీ 24న శ్రీదేవి మరణించింది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి.. హఠాత్తుగా హోటల్ బాత్రూమ్‌లో శవంగా కనిపించింది. అయితే తన మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. తను అలా హఠాత్తుగా మరణించడం నమ్మలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారు. చాలామంది శ్రీదేవి మరణానికి బోనీ కపూర్ కారణమని నిందలు కూడా వేశారు.
పద్మశ్రీ అవార్డ్
1963లో జన్మించిన శ్రీదేవి కేవలం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లో కూడా సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేసింది. తన నటనతో పద్మశ్రీ అవార్డ్ కూడా దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో శ్రీదేవి అనే పేరును ల్యాండ్‌మార్క్‌గా మార్చుకుంది. నటిగా తన చివరి చిత్రం ‘మామ్’. ఆ సినిమా విడుదలయిన కొన్నాళ్లకే శ్రీదేవి మరణించినా కూడా తనకు బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డ్ అందించింది ప్రభుత్వం. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జాన్వీ కపూర్ తన తల్లి పేరు నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.