Rashmika Mandanna: సినీ సెలబ్రిటీలు ఆఫ్ స్క్రీన్ ఎక్కడ ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వారిపై ట్రోల్స్ రావడం ఖాయం. అలాగే పొరపాటున నోరుజారి ట్రోలింగ్‌కు గురయిన వారు ఎంతోమంది ఉన్నారు. తాజాగా రష్మిక మందనా కూడా అదే పరిస్థితి ఎదుర్కుంది. ఒక సినిమా పేరు బదులుగా మరొక సినిమా పేరు చెప్పి ఇరుక్కుపోయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక ఇలా కన్ఫ్యూజ్ అయిపోయింది. దీంతో వెంటనే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అందుకే వెంటనే రష్మిక దీనిపై స్పందించక తప్పలేదు. దీనిపై స్పందిస్తూ రష్మిక అందరికీ సారీ కూడా చెప్పింది.
ఆ రీమేక్
రష్మిక మందనా (Rashmika Mandanna)కు తమిళంలో హీరో విజయ్ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో బయటపెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఇదే విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. తనకు విజయ్ అంటే ఇష్టమని చాలామంది తెలుసని గుర్తుచేసింది. ‘‘నేను ఎప్పుడూ విజయ్ దళపతి అంటే నాకు ఇష్టమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను పెద్ద స్క్రీన్‌పై థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఆయనదే. ఆయన నటించిన గిల్లి సినిమాను నేను మొదటిసారి థియేటర్‌లో చూశాను. నాకు ఇటీవల తెలిసింది ఏంటంటే.. అది పోకిరి సినిమాకు రీమేక్ అని. అప్పట్లో ఈ విషయం నాకు తెలియదు’’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందనా.
Also Read: మాట నిలబెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్.. ఈసారి అలాంటి పాత్రలో..
కాన్ఫిడెంట్‌గా తప్పు సమాధానం
అసలైతే విజయ్ హీరోగా నటించిన ‘గిల్లి’ (Ghilli) సినిమా ‘పోకిరి’కి రీమేక్ కాదు. అది మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ మూవీకి రీమేక్. దీంతో ఒక ఇంటర్వ్యూలో రష్మిక అంత కాన్ఫిడెంట్‌గా తప్పు సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ ట్రోల్స్ కాసేపట్లోనే రష్మిక వరకు చేరుకున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ముందుగా తప్పు సమాధానం చెప్పినందుకు సారీ చెప్పింది. ఇలా తప్పు సమాధానం చెప్పడం వల్ల ఒకవైపు విజయ్ ఫ్యాన్స్, మరొకవైపు మహేశ్ బాబు ఫ్యాన్స్ రష్మికను చూసి నవ్వుకుంటున్నారు. అందుకే తాను కూడా సీరియస్‌గా కాకుండా కూల్‌గానే దీనికి సమాధానమిచ్చింది.
అయిపోయిన తర్వాత అనుకున్నాను
‘అవును.. తెలుసు సారీ.. ఒక్క బూబూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నాను. రేయ్.. గిల్లి అంటే ఒక్కడు రా.. పోకిరి అంటే పోకిరి అని’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందనా. ఈ సోషల్ మీడియా వల్ల ఏదైనా వెంటనే వైరల్ అయిపోతుందని తన స్టైల్‌లో సరదాగా స్పందించింది. మామూలుగా రష్మిక ఆఫ్ స్క్రీన్ చాలా సరదాగా ఉంటుంది కాబట్టి తనపై ట్రోల్స్ వచ్చినా కూడా వాటిపై సీరియస్‌గా స్పందించదు. తాజాగా ‘గిల్లి’ మ్యాటర్‌లో కూడా రష్మిక మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు ఫన్నీగానే రియాక్ట్ అయ్యారు.
#RashmikaMandanna ends the never-ending debate of which one is better between Okkadu/Ghilli and Pokiri/Pokkiri.
"#Ghilli is a remake of #Pokkiri." 😂
Very cute!! ❤pic.twitter.com/kSs6vjYiWO— George 🍿🎥 (@georgeviews) December 20, 2024