BigTV English

RCB Fans : సీఎంకు RCB ఫ్యాన్ బహిరంగ లేఖ.. జూన్ 4న సెలవు ప్రకటించండి

RCB Fans :  సీఎంకు RCB ఫ్యాన్ బహిరంగ లేఖ.. జూన్ 4న సెలవు ప్రకటించండి

RCB Fans : ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ని ఆర్సీబీ జట్టు ఓడించింది. భారీ విజయంతో ఆర్సీబీ ఫైనల్ లోకి ప్రవేశించింది. దాదాపు 18 సంవత్సరాల నుంచి ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అటు అభిమానులు కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలవాలనే తమ కలను చేరుకోవడానికి ఇంకా ఒక అడుగు మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు. ఈ తరుణంలోనే ఓ ఆర్సీబీ అభిమాని ఏకంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య కి ఓ లేఖ రాశాడు. ఫైనల్ లో ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని.. జూన్ 03న ఫైనల్ మ్యాచ్ జరిగితే.. జూన్ 04న ఆర్సీబీ అభిమానుల పండుగ గా ప్రకటించి.. ఒకరోజు సెలవు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ.. సీఎం సిద్దరామయ్యకి లేఖ రాశాడు.  బెల్గామ్ జిల్లాలోని గోకాక్ కి చెందిన శివానంద్ మల్లన్నవర్ అనే యువకుడు ఆర్సీబీకి వీరాభిమాని. ఇక విరాట్ కోహ్లీ అంటే అతనికీ పిచ్చి అభిమానం.


Also Read : Vaibhav Suryavanshi – Modi : అదృష్టం అంటే 14 ఏళ్ల వైభవ్ దే… ఏకంగా మోడీ తోనే

ఇక ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్ కి చేరుకుంది. అందుకే ఆర్సీబీ జట్టు ఫైనల్ లో విజయం సాధిస్తే.. సెలబ్రేట్ చేసుకునేందుకు ఒకరోజు సెలవు కావాలని కోరాడు అభిమాని. అన్ని జిల్లాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తూ సీఎం కి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే.. ప్రభుత్వం ఆ రోజును కర్ణాటక రాష్ట్ర ఆర్సీబీ అభిమానుల పండుగగా అధికారికంగా ప్రకటించి.. ప్రతీ ఏడాది సెలవు ఇవ్వాలని కోరారు. ఇక ఆర్సీబీ అభిమానుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్న సందర్భంగా ప్రతీ జిల్లాలో కర్ణాటక రాజ్యోత్సవాన్ని జరుపుకునే విధంగా ఆర్సీబీ అభిమానుల పండుగను జరుపుకునేందుకు ప్రయత్నం వీలు కల్పించాలని మేము అభ్యర్థిస్తున్నాం. ఈ విషయాన్ని పరిశీలించి సెలవు దినం.. ఆర్సీబీ అభిమానుల ఉత్సవానికి అనుమతి ఇవ్వాలని మేము అన్ని ఆర్సీబీ అభిమానుల తరపున కర్ణాటక ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని లేఖలో పేర్కొన్నాడు.


ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడితే.. వాటిలో 9 మ్యాచ్ ల్లో విజయం సాధించి 2వ స్థానంలో కొనసాగింది. ప్లే ఆప్స్ లో పంజాబ్ కింగ్స్ ని ఓడించి ఫైనల్ కి చేరుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. మరోవైపు ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు జూన్ 01న పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఓటమి చెందిన జట్టు ఇంటికి వెళ్లనుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు బెంగళూరు తో ఫైనల్ లో ఆడేది మళ్లీ పంజాబే అని పలువురు అభిమానులు పేర్కొనడం విశేషం.

Tags

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×