BigTV English

Akhanda2 : టీజర్ కట్ రెడీ, రిలీజ్ అయ్యేది అప్పుడే

Akhanda2 : టీజర్ కట్ రెడీ, రిలీజ్ అయ్యేది అప్పుడే

Akhanda2 : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ టైం చాలా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా కూడా అది పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతుంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా వరుస హిట్ సినిమాలతో మంచి రేంజ్ మీద ఉన్నారు. ఒక తరుణంలో బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది. దాదాపు తన పని అయిపోయింది అనుకున్న తరుణంలో అన్ స్టాపబుల్ అనే షో తన జీవితాన్ని కంప్లీట్ గా మార్చేసింది. ఈ షో తర్వాత బాలకృష్ణను చూసే విధానం కూడా మారిపోయింది.


క్రేజీ కాంబినేషన్ 

బాలకృష్ణ కెరియర్ లో సింహా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. బాలకృష్ణను చాలా పవర్ ఫుల్ గా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. థియేటర్లో విధ్వంసం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. ప్రతి సీన్లో బాలకృష్ణను ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే.


అఖండ 2 టీజర్ అప్డేట్ 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. అయితే ఒకవేళ అప్పుడు కాకపోతే డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. సినిమాకి సంబంధించిన టీజర్ కట్ ఆల్రెడీ జరిగిపోయింది. దాదాపు 110 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంకా సిజి వర్క్ పెండింగ్ ఉంది బాలకృష్ణ జార్జియా వెళ్లకముందే తెలుగు హిందీలో డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ టీజర్ గురించిన అధికారికి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

Also Read : Producer Bunny Vasu: రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×