BigTV English

Terror in Pakistan: హింస, బాంబు పేలుళ్లు.. పిట్టల్లా రాలుతున్న పాక్ పౌరులు

Terror in Pakistan: హింస, బాంబు పేలుళ్లు.. పిట్టల్లా రాలుతున్న పాక్ పౌరులు

పాకిస్తాన్ చేస్తున్న పాపం ఆ దేశ పౌరుల్నే బలి కోరుతోంది. సామాన్య పౌరులు బాంబు పేలుళ్లు, హింసాత్మక ఘటనల్లో చనిపోవడం కొన్ని దేశాల్లో సాధారణం. యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాల్లో అది సర్వ సాధారణం. అయితే యుద్ధం లేకపోయినా పౌరులకు మరణశాసనాలు రాస్తోంది పాకిస్తాన్. ఆ దేశం చేస్తున్న పాపం, ఆ దేశ పౌరులకు శాపంగా మారుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు బాంబు పేలుళ్ల కారణంగా 790మంది పాకిస్తాన్ పౌరులు మరణించారు. ప్రపంచంలోనే ఇలా బాంబు పేలుళ్ల కారణంగా పౌరులు మరణించిన దేశాల జాబితాలో పాకిస్తాన్ ఏడో స్థానంలో ఉంది. సిరియా, మయన్మార్, సూడాన్, లెబనాన్, ఉక్రెయిన్, గాజా.. ఈ లిస్ట్ లో పాకిస్తాన్ కంటే ముందున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా గాజాలో 23,432మంది పౌరులు హింసాత్మక ఘటనల వల్ల చనిపోయారు. ఒక అంచనా ప్రకారం యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాలు రష్యా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్ లో పౌరులు ఎక్కువగా చనిపోవడం ఆందోళన కలిగించే విషయం.


అత్యధిక హింసాత్మక ఘటనలు..
2014 తర్వాత పాకిస్తాన్ లో బాంబుపేలుళ్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. ఈ ఏడాది మాత్రం అత్యధికంగా బాంబు పేలుళ్ల కారణంగా 790 మంది మరణించారు. 2023లో జరిగిన మరణాలకంటే ఇది 440 శాతం అధికం. యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయొలెన్స్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఏడో స్థానంలో ఉన్నట్టు వెల్లడయింది. ఈ ఘటనల్లో అత్యధిక నష్టం బలూచిస్తాన్ వల్ల జరిగింది. బలూచ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో 119మంది పౌరుల మరణానికి కారణం అయ్యారు. బలూచ్ తీవ్రవాదలు తర్వాత పాక్ కి ఎక్కువ నష్టం చేసింది ఇస్లామిక్ స్టేట్ – ఖొరాసన్ ప్రావిన్స్ (IS-KP). ఈ సంస్థ 45 మంది పౌరులు మృత్యువాతపడ్డారు.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ..
2024లో పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడులకు రాష్ట్రేతర సంస్థలు బాధ్యత వహించాయి. దేశం మొత్తంలో 9 ఆత్మాహుతి దాడులు జరిగాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కేవలం రెండు దాడులకు మాత్రమే తాము కారణం అని ప్రకటించుకుంది. అయితే ఆ దాడుల వల్ల ఎక్కువమంది చనిపోయారు. వాస్తవంగా పాకిస్తాన్ ప్రభుత్వమే తీవ్రవాదులను పెంచి పోషిస్తోంది. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో తీవ్రవాదుల సాయంతో హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ పాపం, ఆ దేశ పౌరుల ప్రాణాలే బలికోరడం విశేషం. పాకిస్తాన్ లో ఇతర ప్రాంతాల ఆందళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పౌరుల ప్రాణాలు, సైనికుల ప్రాణాలు హరిస్తోంది. బాంబు పేలుళ్లకు పాల్పడుతోంది. ఆత్మాహుతి దాడులకు తెగబడుతోంది. అందుకే పాకిస్తాన్ తమ పౌరుల ప్రాణాలు కోల్పోతోంది.


పాక్ పౌరుల్లో భయం భయం..
సహజంగా యుద్ధ వాతావరణం ఉన్న దేశాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు. ఎప్పుడు ఏవైపు నుంచి దాడులు జరుగుతాయోనని భయపడుతుంటారు. కానీ యుద్ధం లేకపోయినా పాకిస్తాన్ లో ఉన్న పాపానికి అక్కడి పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆత్మాహుతి దాడులకు బలవుతున్నారు.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×