Producer Bunny Vasu: ప్రొడ్యూసర్ బన్నీ వాసు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ బ్యానర్ గీత ఆర్ట్స్ కి అనుసంధానంగా జిఏ 2 అనే బ్యానర్ ని స్థాపించి ఆ బ్యానర్లు అద్భుతమైన సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా ఇతర భాషల్లో ఉన్న మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకి చూపించాలి అనే ఉద్దేశంతో కొన్ని సినిమా డబ్బింగ్ రైట్స్ ను తీసుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించారు. అలా బన్నీ వాసు అందించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించాయి. అందులో కాంతారా సినిమా కూడా ఒకటి. ఇకపోతే ప్రస్తుతం జియో టు బ్యానర్ నుంచి వచ్చిన సింగల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచి మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది.
థియేటర్స్ ఇష్యూ
ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్ ను బందు చేయాలని పిలుపు కూడా వచ్చింది. ఇక ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరింది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈలోపే డిస్ట్రిబ్యూటర్స్ కు ఎగ్జిబిటర్స్ కు ఉన్న కొన్ని సమస్యలను చర్చించాలి అని అందు నిమిత్తం థియేటర్స్ బంద్ చేయాలి అని వ్యూహాలు కూడా రచించారు కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ కి చేరడంతో పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాలను గుర్తు చేశారు.
బన్నీ వాసు రియాక్షన్
పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించిన తర్వాత నిర్మాత బన్నీ వాస్ కూడా ట్విట్టర్ వేదికగా దీని గురించి స్పందించారు. “సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది.” బన్నీ వాసు మాట్లాడిన మాటలు వాస్తవం అనే చెప్పాలి. అయితే ఇప్పటికైనా ఒక యూనిటీ తెచ్చుకొని తెలుగు సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తారా లేదా వేచి చూడాలి.
https://Twitter.com/TheBunnyVas/status/1926300839477407870?t=7eGF2ZKTzINkpCZRdzxTkw&s=19