BigTV English

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో  NBK109 చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత  అఖండ  2 రానుంది.  బాలయ్య- బోయపాటి కాంబో అంటే.. థియేటర్  లో  ఫ్యాన్స్ కు పూనకాలే.


బాలకృష్ణ కెరీర్ ను మొత్తం మార్చిన సినిమా అంటే  అఖండ అనే చెప్పాలి.  ఇప్పటికీ ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బాలయ్య యాక్టింగ్ ..  బోయపాటి టేకింగ్.. థమన్ మ్యూజిక్.. క్లైమాక్స్ కు ఏ ప్రేక్షకుడు సీట్ లో  లేడు అని చెప్పొచ్చు.

ఇక కలక్షన్స్  లో రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ అంటే.. ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 2 కోసం  బోయపాటి గట్టి కథను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే స్కంద  లాంటి డిజాస్టర్ అందుకోవడంతో.. ఈ మధ్య మీడియా ముందు కూడా కనిపించడం లేదు. ఇక ఈసారి బోయపాటి కొట్టే దెబ్బకు ఇండస్ట్రీ  హడలిపోవాలి. ఆ రేంజ్ లో అఖండ 2 ను సిద్ధం చేస్తున్నాడట.


అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ 2 లో  ఒక స్టార్ హీరోను బాలయ్యకు విలన్ గా దింపుతున్నాడట. ఆ స్టార్ హీరో  ఎవరో కాదు.. మ్యాచో స్టార్ గోపీచంద్. ఏంటి.. నిజమా.. ? అంటే నిజమే అనే మాటలు  వినిపిస్తున్నాయి. గోపీచంద్ కు విలనిజం కొత్తకాదు .. బోయపాటికి ఎలివేషన్స్ ఇచ్చే పద్దతి  కొత్త కాదు. ఈ ఇద్దరు కలిస్తే..  వీరికి బాలయ్య ఊర మాస్ డైలాగ్స్  తోడైతే.. థియేటర్ లో జనాలు పోవడం ఖాయం.  ప్రస్తుతం గోపీచంద్ కు హీరోగా   సక్సెస్ లేదు.

కథలు బావుంటున్నా.. ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించడం లేదు. దీంతో గోపీచంద్ విలన్ గా చేయడం బాగానే ఉంటుందని ప్రేక్షకులు కూడా చెప్పుకొస్తున్నారు. కథ నచ్చితే విలన్ గా చేయడానికి తాను వెనుకాడనని గోపీచంద్ చెప్పుకోచ్చాడు కూడా. ఇక బోయపాటి.. గోపీచంద్ కు కథ చెప్పి ఒప్పించాడా.. ? ఒప్పించాలా.. ? అనేది తెలియదు కానీ, ఈ పుకారు బయటకు రావడమే.. ఇదే కాంబో  ఫిక్స్ చేయమని  అభిమానులు గొడవ చేస్తున్నారు.

అఖండ లో బాలయ్యకు ధీటుగా  శ్రీకాంత్ విలనిజాన్ని చూపించి మెప్పించాడు. శ్రీకాంత్ కూడా  మొదట్లో విలన్ గా చేసి హీరోగా మారినవాడే. ఇక ఇప్పుడు  శ్రీకాంత్ ప్లేస్ లో గోపీచంద్ వస్తాడు అంతే తేడా.  ఇదే కనుక నిజమైతే.. థియేటర్ లో అరుపులకు.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమే అని చెప్పాలి.

ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ విశ్వం సినిమాలో నటిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా  అయినా గోపీచంద్ కు విజయం అందిస్తే ఓకే.. లేకపోతే అఖండ 2 కోసం ఎదురుచూడాల్సిందే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×