Boycott Laila: ఒక చిన్న మాట.. చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక నటుడి నోటిదూల.. సినిమా రిలీజ్ కే అడ్డుపడింది. ఎన్నో నెలల కష్టం.. కోట్ల ఖర్చు.. ప్రమోషన్స్ అన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. కొన్నేళ్లుగా సక్సెస్ అందుకోలేని ఒక యంగ్ హీరో.. ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని.. తనకు సెట్ కానీ వేషం వేశాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఒక నటుడి వలన ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలనీ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ సినిమా ఏంటి.. ? ఆ హీరో ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఫిబ్రవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిన్న నైట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేశారు.
ఈవెంట్ లో అందరూ సినిమా గురించి మాట్లాడారు.. చిరంజీవి రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. అంతా అయిపోయింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. నటుడు పృథ్వీ అనవసరంగా నోరు జారాడు.” మేకల సత్తిగా నేను చేశాను. మేకలు ఎన్ని ఉన్నాయని షార్ట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని చెప్పారు. యాదృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కిస్తే కరెక్ట్ గా 11 గొర్రెలే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాల్లో బ్రహ్మాండంగా పెట్టారు” అంటూ వైసీపీ సీట్ల గురించి ఎద్దేవా చేశాడు. దీంతో నెటిజన్స్ భగ్గుమన్నారు. అసలు సినిమా ఈవెంట్స్ లో రాజకీయాలు ఎందుకు అని కొత్త వివాదానికి తెరలేపారు.
BrahmaAnandam Trailer: బ్రహ్మా ఆనందం ట్రైలర్.. బ్రహ్మాండంగా ఉంది.. కానీ..
ఇక పృథ్వీ చేసిన పని.. విశ్వక్ మెడకు చుట్టుకుంది. పృథ్వీ చేసిన వ్యాఖ్యల వలన లైలా సినిమాను బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా పేరును ట్రెండీ చేస్తున్నారు. ఇక రెండు రోజుల్లో సినిమా పెట్టుకొని ఏంటీ పంచాయితీ అనుకున్నాడో ఏమో.. విశ్వక్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మనోభావాలు దెబ్బతిన్నవారందరికీ సారీ చెప్పాడు. ” మా ఈవెంట్ లో జరిగిన దానికి మేము క్షమాపణలు చెబుతున్నాము.
సినిమాలో ఎవరో ఒకరు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా.. పృథ్వీ మాట్లాడిన మాటల గురించి మాకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటలకు, మా సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో 25 వేల ట్వీట్స్ పెట్టారు. సినిమా బ్రతకాలా? వద్దా..? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు. అది మా కంట్రోల్లో జరగలేదు” అని చెప్పుకొచ్చాడు.
ఇక విశ్వక్ సారీ చెప్పుకురావడాన్ని కొందరు సమర్ధించడం లేదు. తప్పు చేసింది అతను.. మాట్లాడింది అతను.. నువ్వు వచ్చి క్షమించమని అడగడం ఏంటి.. ? దమ్ముంటే అతనితో క్షమాపణలు చెప్పించు అని కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఎప్పుడు లేనిది .. నువ్వు ఇంతగా భయపడుతున్నావ్ ఎందుకు విశ్వక్.. ఈ సినిమా కోసం నువ్వు కష్టపడ్డావ్.. కానీ, ఆ కష్టాన్ని పృథ్వీ నోటిదూలతో మొత్తం పోగొట్టాడు. అతనిచేత సారీ చెప్పించు.. అంతా సెట్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రెండు రోజుల్లో పృథ్వీ బయటకు వచ్చి సారీ చెప్తాడా.. ? లేక సినిమాపై ఆ ఎపెక్ట్ పడేలా చేస్తాడా.. ? అనేది చూడాలి.