BrahmaAnandam Trailer: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు విన్నా కూడా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. మీమ్స్ అనేవి నడుస్తున్నాయి అంటే .. అది బ్రహ్మీ వలనే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెరీర్ ను ఎంతో సక్సెస్ గా కొనసాగిస్తున్న బ్రహ్మీ.. తన వారసుడును హీరోగా నిలబెట్టలేకపోయాడు. బ్రహ్మీ పెద్ద కొడుకు రాజా గౌతమ్.. పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకున్నా .. ఆ తరువాత గౌతమ్ కు ఆశించిన అవకాశాలు రాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చినా అసలు ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియదు.
ఇక ఎలాగైనా కొడుకును హీరోగా చేయాలనీ ఈసారి బ్రహ్మీనే రంగంలోకి దిగాడు. రాజా గౌతమ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రహ్మ ఆనందం. RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నాడు. రియల్ లైఫ్ లో తండ్రీకొడుకులు అయిన వీరు.. సినిమాలో తాతమనవడుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా బ్రహ్మ ఆనందం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా బ్రహ్మ ఆనందం ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” చిన్నప్పుడే ఆంటీ, ఆ తరువాత సుధాకర్ అంకుల్.. ఒక్కడే అయిపోయాడు. జరగకూడనివి అన్ని వాడి లైఫ్ లోనే జరిగాయి. నాతో నేనే.. నాకోసం నేనే అన్నట్లో తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు” అని గౌతమ్ పాత్ర గురించి వెన్నెల కిషోర్.. బ్రహ్మీకి చెప్తున్న షాట్ తో ట్రైలర్ మొదలయ్యింది. తల్లిదండ్రులు లేని ఒక యువకుడు గౌతమ్.. చుట్టూ ఉన్న సమాజంలో బతకకుండా తనకోసమే కానీ, ఇతరుల కోసం బ్రతకను అని మొండిగా బ్రతుకుతుంటాడు. ఇక ఆ సమయంలోనే అతని జీవితంలోకి బ్రహ్మీ వస్తాడు.
Allu Aravind: రామ్ చరణ్‌ను తక్కువ చేసి చెప్పలేదు.. వాడు నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు
గౌతమ్ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో.. ఒక పెద్ద నగరంలో షో చేయడానికి ఛాన్స్ వస్తుంది. దానికి 6 లక్షలు కట్టమని అడుగుతారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని గౌతమ్ కు బ్రహ్మీ ఒక ఆఫర్ ఇస్తాడు. తన పొలం అమ్మి డబ్బు ఇస్తాను. కొన్నిరోజులు తన మనవడిగా నటించమని కోరతాడు. ఆ పొలం కోసం తాత ఏది చెప్పినా చేస్తాను అని మనవడిగా వారి ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ అతనికి ఏమైంది.. ? తాత అతడిని ఎందుకు టార్చర్ చేశాడు.. ? చివరికి గౌతమ్ ఆ షో చేశాడా.. ? ఎందుకు తాత గౌతమ్ ను ఊరికి తీసుకెళ్లాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ లోనే కథ తెలిసిపోతుంది. ఇది కూడా పాత కథలానే అనిపించినా.. కథనం గొప్పగా ఉండబోతుందని తెలుస్తోంది. వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలుబోతుందని అర్ధమవుతుంది. తాతమనవడిగా బ్రహ్మీ – గౌతమ్ అద్భుతంగా కనిపించారు. ఈ సినిమా వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక మునుప్పెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం బ్రహ్మీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా టీమ్ నే కనిపిస్తుంది. అయితే అదే రోజున విశ్వక్ సేన్ లైలా రిలీజ్ అవుతుంది. దాంతో పోటీ పడి బ్రహ్మ ఆనందం నిలుస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.