BigTV English

Bharath: 12 ఏళ్ల త‌ర్వాత ‘బాయ్స్’ ఫేమ్ భరత్ తెలుగు స్ట్ర‌యిట్‌ మూవీ

Bharath: 12 ఏళ్ల త‌ర్వాత ‘బాయ్స్’ ఫేమ్ భరత్ తెలుగు స్ట్ర‌యిట్‌ మూవీ

Bharath:తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాయ్స్‌, ప్రేమిస్తే వంటి చిత్రాల‌తో పాటు స్పైడ‌ర్ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో మెప్పించిన కోలీవుడ్ న‌టుడు భ‌ర‌త్ దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత‌ తెలుగులో న‌టించిన చిత్రం హంట్‌. సుధీర్ బాబు హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. జ‌న‌వ‌రి 26న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా భ‌ర‌త్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంలో పుష్క‌ర కాలం త‌ర్వాత తెలుగులో స్ట్ర‌యిట్ మూవీ చేయ‌టానికి గ‌ల కార‌ణాలేంట‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న మాట్లాడుతూ ‘‘నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో… అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. పైగా… సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్. సీసీఎల్ లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు కూడా ఆడాం. శ్రీకాంత్ గారు కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్. సో.. అన్నీ కుదిరి ఈ సినిమా ఓకే చేశా’’ అన్నారు.


ఇంకా హంట్ మూవీలో పాత్ర గురించి భరత్ మాట్లాడుతూ ‘‘తమిళ్ మూవీ కాళిదాసులో నా లుక్ చూసి డైరెక్టర్ మహేష్ ఈ మూవీలోనూ అలానే ఉండాలనుకున్నారు. ఆ సినిమా హిట్ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కవుటవుతుందని అదే లుక్‌తో నటించా’’ అని తెలిపారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×