BigTV English

Onion Peel: ఉల్లి తొక్కే కదా అని తీసిపారేయకండి.. బోలెడు ఉపయోగాలు

Onion Peel: ఉల్లి తొక్కే కదా అని తీసిపారేయకండి.. బోలెడు ఉపయోగాలు

Onion Peel: ఉల్లి చేసే మేలు తల్లి చేయదన్నది పాత సామెత.. ఇప్పుడు ఉల్లి తొక్కల మేలు ఎవరూ చేయలేరంటున్నారు. చాలా మంది ఉల్లి తొక్కలను తీసిపారేస్తారు. వీటితో కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియక పడేస్తుంటారు. ఉల్లిపాయ తొక్కల్లో చాలా పోషకాలు ఉంటాయి.


చర్మం, జుట్టుకు ఇవి మేలు చేస్తాయి. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఎంతో సహాయపడతాయి. ఉల్లి తొక్కలను నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టి తొక్కలను వడ కట్టి ఆరోగ్యకరమైన కప్పు టీని తయారుచేసుకుని తాగవచ్చు. ఈ టీ తాగితే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. అలాగే ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉల్లి తొక్కల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

ఉల్లిపాయ తొక్కలతో తెల్లజుట్టు రంగు మార్చుకోవచ్చు. బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా అయ్యేవరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలిపి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


కంపోస్ట్ చేయడానికి ఉల్లిపాయ తొక్కలు బాగా సాయపడతాయి. వీటిలోని ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వల్ల అద్భుతమైన కంపోస్ట్‌ తయారవుతుంది. ఉల్లి తొక్కలను వేయించడం ద్వారా వంటల రుచి, రంగును మెరుగుపరచుకోవచ్చు. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. నిద్రబాగా పడుతుంది. పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఈ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీటిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×