Tollywood:ప్రముఖ సినీ నటుడు వేణు తొట్టెంపూడి (Venu thottempudi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొన్ని చిత్రాలలో నటించారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి ఈయన ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉండి, ఇప్పుడు సడన్గా వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు. తాజాగా రూ.1000 కోట్ల స్కామ్ లో ఈయనపై కేసు ఫైల్ అయినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి, అటు అభిమానులతో పాటు ఇటు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
రూ.1000 కోట్ల స్కామ్ లో వేణు పై కేస్ ఫైల్..
ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు హేమలత, భాస్కరరావు, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం కేస్ నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గతంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ.. ఉత్తరాఖండ్ లో జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దక్కించుకుంది. బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ సబ్ కాంట్రాక్టుకి తీసుకున్నాయి. అయితే స్వాతీ కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో రిత్విక్ ప్రాజెక్ట్ వారు 2002లో పనులు మొదలుపెట్టారు. ఇక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, బీ.హెచ్.డీ.సీ మధ్య వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించాయి. అటు పనులకు సంబంధించి రూ.1,010.25 కోట్లు డీహెచ్డీసీ ఖాతాలో జమ అయ్యాయి. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహకులు రద్దు చేశారు. దీంతో ఎండి రవికృష్ణ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా.. నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహకులపై అలాగే వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వేణు సినిమా జీవితం..
వేణు తొట్టెంపూడి ప్రకాశం జిల్లాలోని కొండపి మండలం పెరిదేపి గ్రామంలో జన్మించారు. ఒంగోలు, విజయవాడ, మధురై లో ఈయన తండ్రి ఇంగ్లీష్ లో లండన్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పూర్తి చేసి, అధ్యాపకుడిగా విజయవాడ , మధురై లో పనిచేశారు. మధురైలోని ప్రముఖ కళాశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసి ఆయన పదవీ విరమణ కూడా చేశారు. ఈయన సోదరి చిన్నమ్మ, ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం టిఆర్ఎస్ నేత నామ నాగేశ్వరరావు సతీమణి వేణు మధురైలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి కర్ణాటకలో ధార్వాద్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1999లో స్వయంవరం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు . ఇక తర్వాత పలు సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు.