Intinti Ramayanam Today Episode February 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయా, శ్రీకర్ లు ఇంటికి రావడం పల్లవి సహించలేక పోతుంది. తన కొడుకు కోడలు రావడంతో పార్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో జరుగుతున్న గొడవలు కి బాధపడాలు మీద వచ్చినందుకు సంతోష పడాలోఅని కమల్ అంటాడు. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. అవని శ్రీకర్కు ఫోన్ చేస్తుంది. ఇంటికెళ్ళమని చెప్పాను కదా వెళ్ళావా అంటే ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాము వదిన మీరు లేరని లోటు మాకు తెలుస్తుంది అనేసి అనగానే మావయ్య గారు నువ్వు రావడానికి ఒప్పుకున్నారు కదా ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా మావయ్య గారిని అత్తయ్య గారిని అలాగే ఆరాధ్యను బాగా చూసుకోండి అని శ్రీకర్కు అవని చెప్తుంది. ఇక శ్రీయా ఫోన్ తీసుకొని అవినీతో మాట్లాడుతుంది. ఇంట్లో ఉన్న సమస్యల గురించి నీకు ఆల్రెడీ శ్రీకర్ చెప్పారు కదా మీరు జాగ్రత్తగా ఉండండి అందరిని బాగా చూసుకోండి అనేసి అంటుంది. శ్రీయ బాధపడుతూ ఉంటుంది. పెళ్లి జరగడానికి అవని అక్క ఎంతో కష్టపడింది ఆమెతో కలిసి ఉండాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆమె లేకుండా పోయిందని బాధపడుతుంది. ఇక కమల్ దగ్గరికి శ్రీకర్ వస్తాడు.. ఏమైందిరా అలా ఉన్నావ్ ఎందుకు బాధపడుతున్నావ్ అంటే మీరు వచ్చినందుకు సంతోష పడాలో తెలియట్లేదు అన్నయ్య వదిన లేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదని కమలంటాడు అప్పుడే ఆరాధ్య బాబాయ్ నాకు అమ్మ కావాలి అనేసి వస్తుంది. ఇక ఆరాధ్య కమ్మలు అర్ధరాత్రి రోడ్లమీద అమ్మ కోసం వెతుకుదామని వెళ్తారు. ఇక శ్రీయ స్పీకర్లు అవని అవని అక్క ఎక్కడ ఉందని బాధపడుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆరాధ్య కోసం బాధపడుతూ ఉంటుంది. నా కూతురు తినిందా లేదా అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కనకం తనకి జ్వరం వచ్చిందని నాటకం ఆడుతుంది మళ్ళీ అవని వంట చేస్తుంది. అప్పుడే శీను వచ్చి నీకు జ్వరం వస్తే జ్వరం వచ్చిందని లాగా ఉండు. అమ్మగారు చేత వంట చేపిస్తావా అనేసి శ్రీను అంటాడు.. దానికి కనకం నా తప్పేముంది బాగలేదని చెప్తే ఆవిడ చేశారు దాంతో తప్పేమైనా ఉందా అని అరుస్తుంది ఇక అవని వచ్చి అందులో తప్పేముంది శ్రీను ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సాయం చేసుకోకూడదా అనేసి అంటాడు. ఇక ఉదయం లేవగానే శ్రీయ బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏమైంది శ్రీయ బాధపడుతున్నావ్ ఏదని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇంతకుముందు మనం అత్తయ్య మన రూమ్ లోకి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే పల్లవి వచ్చిందండి అప్పుడు ఏంటి బయట నుంచే వెళ్ళిపోతున్నావ్ అంత దొంగ చాటుగా ఎందుకు వింటున్నావ్ అనేసి అడిగితే నీ హద్దుల్లో నువ్వు ఉండు ఎక్కువ మాట్లాడొద్దు అనేసి నాకు వార్నింగ్ ఇచ్చింది నా తప్పేముంది అందులో అనేసి అంటుంది..
ఇక అవనిని కూరగాయలు తీసుకురమ్మని కనకమంటుంది.. సరే నేను వెళ్లి తీసుకొస్తాలే అనేసి అవని వెళ్తుంది. కమల్ అక్షయ్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్తుంటారు అయితే మధ్యలో కమల్ వదిన గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అన్నయ్య వదిన చాలా మంచిది అనేసి క్లాస్ పీకుతాడు కానీ అక్షయ్ మాత్రం అమ్మ చెప్పింది నిజం అనేసి అంటాడు. ఇక కమ్మను కారేసుకునేళ్ళు నేను క్యాబ్లో వెళ్ళిపోతానంటే సరే అన్నయ్య నేను ఇంక మాట్లాడనులే నీకు వదిన మీద ఇంత నమ్మకం లేదు అని నేను అనుకోలేదు అనేసి అంటాడు అప్పుడే అవని కూరగాయలు తీసుకొని బయట కనిపిస్తుంది. అవన్నీ చూసిన కమల్ వదిన అనేసి ఆపమని చెప్తాడు.
అవని దగ్గరికి వెళ్లి కమల్ మా అమ్మ నాకు మళ్ళీ దొరికేసింది బిడ్డల తప్పు చేయకపోయినా ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా బిడ్డను వదిలేసి పోతావా అమ్మ అనేసి అడుగుతాడు. ఎక్కడున్నావు ఏంటో అని నేను శ్రీకర్ అన్నయ్య చాలా వెతికము కానీ నువ్వు కనిపించలేదు ఎంత బాధ పడ్డామో తెలుసా? ఇక ఆరాధ్య అంత బాధ పడుతుందో తెలుసా? అనేసి అడుగుతాడు.. ఇక అవని అక్షయ దగ్గరకు వస్తుంది నేను తప్పు చేశాను అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా అనేసి అంటుంది. దానికి అక్షయ్ మా అమ్మ కళ్ళతో చూసింది తప్పు కాకుండా పోదు కదా మా అమ్మ చెప్పింది నిజమనేసి అంటాడు కానీ అవని మాత్రం నన్ను మీరు నమ్మట్లేదు పదేళ్ల కాపురం చేసినా కూడా మీరు నా మీద నమ్మకాన్ని చూపించలేదు అంటే నేను ఏమనుకోవాలి నేను తప్పు చేయలేదు నా తప్పేమీ లేదు అని నిరూపించుకున్న రోజే మీరు బాధపడతారని అంటుంది. కానీ అక్షయ్ మాత్రం ఏం వినకుండా వెళ్ళిపోతాడు.. కమల్ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద రచ్చ చేస్తాడు.
భానుమతి పార్వతీ కంగారుపడుతూ బయటకు వస్తారు. ఏమైందిరా ఏం చేస్తున్నావ్ నువ్వు అనేసి అంటే వదిన బయట కనిపించింది కానీ అన్నయ్య మా అమ్మ చెప్పింది నిజం నువ్వు అబద్దం చెప్తున్నావ్ నువ్వే మమ్మల్ని చంపాలి అనుకున్నావు అని అంటాడు వదిన ఎంత బాధపడిందో తెలుసా అని కమల్ బాధపడతాడు. తప్పు చేశానని నమ్ముతున్నారా అని వదిన అడుగుతుంటే… అమ్మ గౌరవించడం మంచిదే కానీ అమ్మని గౌరవించడం కోసం భార్యని ఎవరైనా రోడ్డు మీద వదిలేస్తారా.. ఎందుకు మాట్లాడలేదు. అమ్మ చెప్పిన మాట విని భార్య చెప్పిన మాట వినకుండా అలాగే వదిలేస్తావా.. నువ్వేం మనిషివి అని కమల్ అనగానే పార్వతి చెంప పగలగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..