BigTV English

Upendra : ఆ కామెంట్స్ పై వివాదం.. యాక్టర్ ఉపేంద్రపై కేసు..

Upendra : ఆ కామెంట్స్ పై వివాదం.. యాక్టర్ ఉపేంద్రపై కేసు..

Upendra : విలక్షణ కన్నడ నటుడు ఉపేంద్ర వివాదంలో చిక్కుకున్నాడు. తన రాజకీయ పార్టీ ప్రజాకీయా వార్షికోత్సవంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. దళితులను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. బెంగళూరులో కేసు కూడా నమోదైంది.


పార్టీ వార్షికోత్సవం వేళ ఉపేంద్ర ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా గ్రామ్ లో లైవ్ ఇచ్చారు. విమర్శకులను పోల్చుతూ సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. తీవ్ర చర్చకు దారి తీశాయి. వివాదానానికి ఆజ్యం పోశాయి.

ఉపేంద్ర వ్యాఖ్యలు తమను అవమాన పరిచేలా ఉన్నాయంటూ బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌ లో కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపేంద్రపై కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యలపై విచారణ చేస్తున్నామని సౌత్‌ బెంగళూరు డీసీపీ కృష్ణకాంత్‌ వెల్లడించారు.


తన కామెంట్స్ పై వివాదం రేగడంతో ఉపేంద్ర స్పందించారు. అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పారు. ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలో ఉన్న లైవ్‌ వీడియోను తొలగించారు.
పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. తన వల్ల కొంతమంది బాధపడ్డారని గ్రహించిన వెంటనే లైవ్‌ వీడియోను తొలగించానని పేర్కొన్నారు. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమించాలని పోస్ట్‌ పెట్టారు.

ఒకప్పుడు వెరైటీ కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఉపేంద్ర ఆకట్టుకున్నాడు. విభిన్న నటుడిగా గుర్తింపుపొందాడు. కన్నడతోపాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. కొంతకాలం ఆయన సినిమాలు తగ్గాయి. కొన్ని మూవీస్ లో అతిథి పాత్రలు చేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో పార్టీ పెట్టారు. ఆ పార్టీ వార్షికోత్సవం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×