Dhadak 2 : ‘యానిమల్’ (Animal) మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్ త్రిప్తి దిమ్రి (Triptii Dimri). ఈ మూవీలో ఆమె కనిపించింది కొన్ని సెకండ్లే అయినా, త్రిప్తి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక అప్పటి నుంచి వరుసగా వచ్చిన ఆఫర్లను ఉపయోగించుకుంటూ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కానీ ఆమె చేస్తున్న సినిమాలలో హద్దు మీరిన ఘాటు సన్నివేశాలు ఉండడంతో విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె చేస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ధడక్ 2’ (Dhadak 2) ఇప్పుడు సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఇప్పటికే ఓసారి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. మరి ఈ మూవీకి సెన్సార్ సమస్యలు రావడానికి గల కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘ధడక్ 2’కి సెన్సార్ సమస్యలు
త్రిప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది నటించిన ‘ధడక్ 2’ గత ఏడాది నవంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలను ఫిబ్రవరి 2025కి వాయిదా వేశారు. మరోసారి ఈ మూవీ వాయిదా పడి, హోలీ రోజున థియేటర్లలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ కంప్లీట్ గా ఫిబ్రవరి నెల దాదాపుగా ముగియడంతో, మూవీ కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలోని కొన్ని సీన్లకు అడ్డు చెప్పడం వంటి సమస్యల కారణంగా మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుందని సమాచారం. ‘ధడక్ 2’లో భారతదేశంలో కుల వివక్షను ప్రస్తావించే సున్నితమైన కంటెంట్ ఉందని అంటున్నారు. నిజానికి త్రిప్తి అనగానే ఘాటు సన్నివేశాలు గుర్తొస్తాయి. కానీ ఈ మూవీలో అలాంటి సీన్స్ కాకుండా కుల వివక్ష గురించి ఉండడమే సమస్య అని తెలుస్తోంది.
గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సెన్సార్ బోర్డు
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘ధడక్ 2’ కుల సమస్యలతో ముడిపడి ఉంది. నిజానికి సెన్సార్ బృందం ఈ చిత్రాన్ని, దాన్ని ధైర్యంగా తెరకెక్కించిన నిర్మాతలను ప్రశంసించింది. కానీ కంటెంట్ కారణంగా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ రేటింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అంతేకాకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేయాలని సూచించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ‘ధడక్ 2’ తమిళ భాషా చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’కు రీమేక్ అంటున్నారు. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే ‘పరియేరుమ్ పెరుమాళ్’ ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోనప్పుడు, ‘ధడక్ 2’కు మాత్రం ఎందుకు సమస్యలు ఎదురవుతున్నాయి ? అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన మూవీ ‘ధడక్’కు సీక్వెల్ ‘ధడక్ 2’. ఫస్ట్ పార్ట్ పరువు హత్యల నేపథ్యంలో సాగగా, రెండవ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అలాంటి కథతోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది. అందుకే ఈ మూవీకి సెన్సార్ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయని అంటున్నారు. మరి సెన్సార్ ఈ మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దానికి చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.