BigTV English

Mohanlal: మోహన్‌లాల్ సినిమాకు ఎదురుదెబ్బ.. విడుదల చేయొద్దంటూ నిర్మాతల స్ట్రైక్..

Mohanlal: మోహన్‌లాల్ సినిమాకు ఎదురుదెబ్బ.. విడుదల చేయొద్దంటూ నిర్మాతల స్ట్రైక్..

Mohanlal: గత కొన్నిరోజులుగా మాలీవుడ్‌లో పరిస్థితులు పెద్దగా బాలేదు. ఎంటర్‌టైన్మెంట్ ట్యాక్స్, యాక్టర్ల రెమ్యునరేషన్ విషయంలో మార్పుల కోసం నిర్మాతలంగా నిర్ణయించుకొని స్ట్రైక్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ స్ట్రైక్ మొదలయ్యే ముందు షూటింగ్స్, రిలీజ్‌లు అన్నీ ఆపేయాలని టైమ్ కూడా ఇచ్చారు. అయినా కూడా మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించిన ‘ఎల్2ఈ ఎంపురన్’ మూవీ మార్చి 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఫిల్మ్ ఛాంబర్, ఇతర నిర్మాతలంతా కలిసి ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. మార్చి 27నే స్ట్రైక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ విషయంపై ఈ సినిమా నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ స్వయంగా స్పందించారు.


నోటీసులు జారీ

కొత్త సినిమాలు ఏమైనా ప్రారంభించాలనే ఆలోచన ఉంటే ముందుగానే దానికి సంబంధించిన కండీషన్స్‌ను ఒప్పుకుంటున్నట్టుగా అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాలని మాలీవుడ్ మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని మాలీవుడ్‌లో ఫిల్మ్ అసోసియేషన్స్ అందరికీ వివరించారు కూడా. కానీ ఇప్పుడు ఇదంతా ‘ఎల్2ఈ ఎంపురన్’ (L2E Empuraan) విడుదలను వాయిదా వేయడం కోసమే చేస్తున్నారని అనుమానాలు మొదలయ్యాయి. మొదట్లో ఎంటర్‌టైన్మెంట్ ట్యాక్స్‌ను తగ్గించే విషయంలో ఫిల్మ్ ఛాంబర్ పూర్తిగా సహకారం అందించింది. అంతే కాకుండా ఏ యాక్టర్ కూడా దీనికి అతీతం కాదని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ‘ఎల్2ఈ ఎంపురన్’ రిలీజ్ విషయంపై ఆంటోనీ పెరంబవూర్‌ (Antony Perumbavoor)కు నోటీసులు కూడా జారీ చేసింది.


పోస్ట్ వల్ల రచ్చ

నిర్మాత జీ సురేశ్ కుమార్‌పై వ్యతిరేకంగా ఒక ఫేస్‌బుక్ పోస్ట్ షేర్ చేశాడు ఆంటోనీ. ఆ పోస్ట్‌ను డిలీట్ చేయాలని లేదా ఏడు రోజుల్లో యాక్షన్ తీసుకుంటామని ఆ నోటీసుల్లో ఉంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. ‘నిర్మాత, యాక్టర్ అయిన జీ సురేశ్ కుమార్ మలయాళ ఇండస్ట్రీ గురించి గత నెలలో చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి నేను ఈ నోట్ రాస్తున్నాను. ఒక వ్యక్తిగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఆయనకు ఉంది. కానీ ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుంది. ఆయన అభిప్రాయాలను మాత్రమే ఆయన చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పాలని డిసైడ్ అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు ఆంటోనీ.

Also Read: ‘మార్కో’ దర్శకుడికి బంఫర్ ఆఫర్.. బాలీవుడ్ బడా నిర్మాతతో డీల్..

మాలీవుడ్‌లో అంతర్యుద్ధం

‘ఆర్గనైజేషన్‌లో ఉన్న ఇలాంటి మనుషులే సినిమాలకు 100 కోట్లు, 200 కోట్లు లాభం వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా చేయడంలో తప్పేమీ లేదు. ఇతర భాషల నుండి విడుదల అవుతున్న పెద్ద సినిమాలకు పోటీగా మలయాళ చిత్రాలు ఇలాంటి ఘనతను సాధించడం సంతోషకరం’ అంటూ సురేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడు ఆంటోనీ. దీంతో ఆంటోనీనే నిర్మాతలకు టార్గెట్ అయ్యాడు. తను నిర్మించిన ‘ఎల్2ఈ ఎంపురన్’ సినిమా విడుదలను ఎలాగైనా ఆపేయాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకే మార్చి 27న ఈ సినిమా విడుదల కాకుండా స్ట్రైక్‌ను ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే.. మాలీవుడ్‌లో అంతర్యుద్ధం మొదలయ్యిందని అర్థమవుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×